రత్నధారణతో ఫలితమెంత?: ఏ రత్నాన్ని ఎందుకు ధరించాలి..
జ్యోతి శ్శాస్త్రంలో ప్రాయశ్చిత్తకాండ, పరిహారాన్ని సూచించడం ద్వారా చెడు ఫలితం యొక్క తీవ్రతని (జాతకము ననుసరించి) ఉపశమింప చేయడం లేదా నిర్మూలించడం చేస్తుంది.
కొన్ని రత్నాలు మంచి చేస్తాయి, కొన్ని మారకమవుతాయి. అసలు ఏ రత్నాన్ని ఎందుకు ధరించాలి? వాటివల్ల ఫలితమేంత.
జాతకములో గ్రహముల యొక్క ప్రభావం ఒక ప్రవాహంలాంటిది. ఆ ప్రభావ ప్రవాహాన్ని మనకి అపాయంలేకుండా మలిచే ఉపాయాలే మణి, మంత్ర, ఔషధులు. జ్యోతి శ్శాస్త్రంలో ప్రాయశ్చిత్తకాండ, పరిహారాన్ని సూచించడం ద్వారా చెడు ఫలితం యొక్క తీవ్రతని (జాతకము ననుసరించి) ఉపశమింప చేయడం లేదా నిర్మూలించడం చేస్తుంది.
రోగ నిర్మూలనానికి రోగనిదానం (Diagnosis) ఎంత ముఖ్యమో!, జాతకంలో చేడుయోగ నివారణానికి సద్యోగ నిర్మాణానికి జాతకంలోని గ్రహస్థితియే ప్రధానపాత్ర వహిస్తుందనేది ఖచ్చితమైన. జ్యోతిశ్శాస్త్రం జాతకరీత్యా అనుభవించవలసిన ఫలితాలతోపాటు జాతకుని జీవిత పరిధిని, పధాన్ని సూచిస్తుంది, నిర్దేశిస్తుంది. అందువలన ఆ పరిధికి లోబడి ఫలితాన్ని గమనించడం జ్యోతిష్కుని- ప్రతిభ వ్యక్తమవుతుంది.
ఎందుకంటే ప్రతిజాతకానికి ఒక "కీలకం" ఉంటుంది. ఆ "కీలకాన్ని" పసిగట్టగలిగితే జాతకం యొక్క లోతు (Depth) అవగతమవుతుంది. అంతేకాకుండా, ఆ కీలకాన్ని పసిగట్టడం ద్వారా జాతకం యొక్క ఉత్తమ, మధ్యమ, అధమరూపమైన స్థాయి భేదం అవగతమవుతుంది.

తద్వారా జాతకుని యొక్క జాతకం స్థాయిని,
ఇలాగ లోబడిన ఫలితాంశాన్ని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. ఎందుకంటే పీఠికలో కనిపించే (అవ)యోగాలు అనుభవంలోనికి రాకుండా ఉండడానికి ఈ "కీలకమే" మూల కారణమవుతోంది. అందువలన జాతకము యొక్క స్థాయినిబట్టి, పరిధినిబట్టి, తగిన పరిహార సూచించడం ద్వారా ఆశించిన ఫలితం అందుబాటు లోకి వస్తుంది.
కాబట్టి, రత్నధారణ అనేది ఒక విధమైన పరిహారమైతే, ఆ పరిహారోపాయాన్ని జాతకుని గ్రహస్థితి యొక్క బలాబలాల ద్వారానే మేలు జరుగుతుంది. జాతకంలో గల దుర్యోగ నివారణానికి, సద్యోగ నిర్మాణానికి అవసరమయ్యే విధంగా జాతి రత్నాన్ని ధరించడమే, శాస్త్రీయవిధానం అవుతుంది.ఈ విధంగా ధరించిన జాతిరత్నాలు (జాతిరాళ్ళు) జాతకాలను మారుస్తాయనే చెప్పాలి.












Click it and Unblock the Notifications