Mauni Amavasya 2026: ఈ రాత్రికి ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట్లో కనకవర్షమే!

Mauni Amavasya 2026: ఈ రోజు మౌని అమావాస్య. హిందూ ధర్మంలో ఆత్మశుద్ధికి, ఆధ్యాత్మిక సాధనకు ఈ రోజు అత్యంత పవిత్రమైనది. మౌన వ్రతం, పవిత్ర స్నానాలు, దానధర్మాలకు ఈ రోజు పెట్టింది పేరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మౌని అమావాస్య నాడు సాయంత్రం లేదా రాత్రి వేళ కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం వల్ల పేదరికం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

మౌని అమావాస్య రాత్రి చేయవలసిన ఆ 4 ముఖ్యమైన పనులు ఇవే:

1. తులసి పూజ: ధన ప్రాప్తి కోసం
మౌని అమావాస్య సాయంత్రం తులసి మొక్క వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి, మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత అక్కడే కాసేపు కూర్చుని లక్ష్మీదేవి మంత్రాలను జపించాలి. శాస్త్రాల ప్రకారం తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఉండదు.

Mauni Amavasya 2026 Do This One Powerful Ritual at Night for Wealth and Prosperity

2. రాహు-కేతు దోష నివారణ
జాతకంలో రాహు-కేతువుల ప్రతికూల ప్రభావం ఉన్నవారు ఈ రోజు సాయంత్రం శివాలయానికి వెళ్లాలి. పరమశివునికి రుద్రాక్ష మాలను సమర్పించి, అదే మాలతో 108 సార్లు శివ మంత్రాన్ని జపించాలి. జపం ముగిసిన తర్వాత ఆ మాలను ధరించడం లేదా మీ వద్ద ఉంచుకోవడం వల్ల రాహు-కేతువుల అశుభ ప్రభావం తగ్గి.. పనులన్నీ సజావుగా సాగుతాయి.

3. దానధర్మాలు: మోక్షం, ఐశ్వర్యం
మౌని అమావాస్య నాడు దానం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. మీ స్తోమతను బట్టి పేదవారికి అన్నం, వస్త్రాలు, నల్ల నువ్వులు, బెల్లం దానం చేయాలి.

వివిధ రకాల దానాలు:

*గో దానం: మోక్షం కోసం.

*భూ దానం: ఆర్థిక వృద్ధి కోసం.

*స్వర్ణ దానం: రోగాలు, అప్పుల నుంచి విముక్తి కోసం.

నెయ్యి దానం: కుటుంబ సుఖశాంతుల కోసం.

4. పితృదేవతల కోసం దీపారాధన
మౌని అమావాస్య నాడు సాయంత్రం మూడు ముఖ్యమైన ప్రదేశాలలో దీపాలు వెలిగించడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి.

*దక్షిణ దిశ: ఇంటి దక్షిణ దిశలో పితృదేవతల కోసం నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.

*రావి చెట్టు: రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి.

తులసి: లక్ష్మీ అనుగ్రహం కోసం తులసి కోట వద్ద దీపం వెలిగించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+