ఇద్దరికీ సంతాన సమస్య: అందువల్లనే ఇలా..

01.(6) శివ కృష్ణ, రాజమండ్రి, వివాహం ఇబ్బందికారకంగ మారింది.

లగ్న కేతు 7వ రాహువు, 7వ అధిపతి 6వ అధిపతి కుజుడు కలిసి ఉన్నారు. 8వ అధిపతి లగ్నం లో ఉండి 7వ భావాన్ని చూస్తున్నాడు. ఈ గోచారంలో అష్టమ శని, రాహువు దశ నడుస్తుంది. వీటికి పరిహారాలు చేసుకుంటూ ఉండండి. ఆపదాం అపహర్తారం అనే రామ నామ శ్లోకాన్ని జపిస్తూ ఉండండి. మీతో విడిపోవడంలో మీ భార్య జాతకం పాత్రకూడా కొంత ఉంది.

02. కొండ మారుతి, జగిత్యాల, మ్యారేజ్‌ మ్యాచింగ్‌

ఇచ్చిన ఇద్దరి జాతకాలలో అబ్బాయి జాతకంలో 7వ అధిపతి 8లో ఉన్నాడు, వ్యయంలో కుజుడు కుజదోషం ఉంది. అమ్మాయికి ఇవేవీ లేవు. కానీ ఇతర పొంతనలు కలిసాయి. ఇది సాధారణ మ్యాచింగ్‌ మాత్రమే. గొప్ప బలం లేదు. ఇక నిర్ణయం మీది.

03. వాణి లోగేష్‌ ల సంతాన సమస్య

మీ ఇద్దరిలో లోగేష్‌ గారి జాతకంలో 5వ అధిపతి కేతువుతో కలసి 6లో ఉన్నాడు. గోచారంలో వచేగచ జనవరి దాకా 8వ శని నడుస్తుంది. వాణి గారి జాతకంలో సంతాన భావం పైన శనిదృష్టి ఉంది. రాహువు దశ నడుస్తుంది. ఇవన్నీ సమస్యలే వీటికి శాంతి పూజచేసుకుంటూ సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండండి. సంతానానికి ఇచ్చిన శ్లోకాన్ని చదువుతూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

04. వెలిగేటి రాధారమణ, హరితల సంతాన సమస్య

హరిత గారి జాతకంలో 5లో రాహువున్నాడు. రమణ గారి జాతకంలో సంతాన కారకుడు కుజుడితో కలిసి 6లో ఉన్నాడు. రాహువు దశ నడుస్తుంది. గోచారంలో ఏలినాటి శని నడుస్తుంది. ఇద్దరికీ సమస్యలున్నాయి. వీటికి శాంతి పూజచేసుకుంటూ సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండండి. సంతానానికి ఇచ్చిన శ్లోకాన్ని చదువుతూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

05. తులసీ నాగవెంకట రావు, అనకాపల్లి, స్థిరత్వం లేని ఉద్యోగం

చర రాశి, వాయు తత్వ రాశి మీ జాతకంలో ఉద్యోగభావంగా ఉంది. నవాంశలోనూ దశమంలో రాహువు చంద్రుడున్నాడు. వీటి వలన సిరమైన ఉద్యోగానికి ఆటంకాలు కలుగుతాయి. ఏలినాటి శని చివరి దశలో ఉంది. దశ కొంత ఫరవాలేదు. రాహు, చంద్ర గ్రహాలు వీటికి దానాలు చేసుకోవాలి. శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

06. సురేష్‌ కుమార్‌, జాబ్‌ సెటిల్‌మెంట్‌,

నవాంశలో వృత్తికారకుడు శని, రాహువుతో కలిసి ఉన్నాడు. రాశి చక్రంలో 9వ కేతువు, ఏలినాటి శని అన్నీ కారకాలే. మీ ప్రయ్న లోపం కూడా కొంత కారణం. ఐతే వచ్చే జనవరి తర్వాత కొంత మేలు జరుగుతుంది. పై గ్రహాలకి దానాలు చేసుకోవాలి. శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

07. యన్‌. మల్లికార్జున, 09986865044 సంతానము

మీకు వ్యయాధిపతి గురుడు సంతాన భావాన్ని చూడటం, ప్రస్తుతం ఏలినాటి శని నడవటం ఇవి ఆటంకాలు. వీటికి పరిహారాలు చేసుకుంటూ. సంతానం కోసం మేం ఇచ్చిన శ్లోకం చదువుతూ ఉండండి.అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి. ఒకసారి మీ భార్య జాతకం కూడా చూపించండి.

08. మధుబాబు పేరవలి, మఖ నక్షత్రం, ఉద్యోగం

మీరు పేరు మాత్రమే ఇచ్చారు. నక్షత్రాన్ని బట్టి రాహువుకి దానాలు పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. గోచార రీత్యా గజ కేసరీ యోగం వల్ల ఆటంకాలుంటాయి కాబట్టి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

09. బార్లి శరత్‌ చంద్ర, విశాఖ పట్నం, గవర్నమెంట్‌ జాబ్‌

మీకు కొంత వరకు అవకాశం ఉంది కొంత గట్టి ప్రయత్నం ఎక్కువ దానాలు పుణ్య కార్యాలు చేస్తూ ఉండండి.

10. ఉప్పలపాటి నవీన్‌, ఉద్యోగం ఎందుకు దొరకటం లేదు

మీకు వృత్తి భావంలో కేతువు, వతి కారకుడు లగ్నంలో ఉన్నాడు ఏలినాటి శని నడుస్తుంది. దశ బాగానే ఉంది. శనికి పరిహారం చేసుకోండి, ఆగస్ట్‌ తర్వాత కొంత మెరుగుపడుతుంది. పై గ్రహాలకి దానాలు చేసుకోవాలి. శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

One India Telugu astrologer answers readers' questions

11. సాయి బొద్దవరం, పెద్దాపురం, ప్రేమ వివాహం ( ఇదేం ప్రశ్న)

మీకు ప్రేమవివాహం అవుతుందా లేదా చెప్పవచ్చు, కానీ ఒక వ్యక్తిని ఎలా సొంతం చేసుకోవాలో జ్యోతిష్కున్ని అడగకండి. ఆ ఆలోచన ముందు తొలగించుకోండి. కెరియర్‌ చూసుకోండి. మంచి జాతకం మీది. అంతకంటే మంచి అమ్మాయి భార్యగా వస్తుంది. శుభం.

12. నారాయణ, కడప, ట్రాన్స్‌ఫర్‌ అవుతుందా ?

మీకు ట్రాన్స్‌ఫర్‌ అవడానికి అవకాశం మరొక సంవత్సరం వరకూ లేదు.

13. కొంత మంది సరైన వివరాలు ఇవ్వలేదు వారి వివరాలు ఇవి.

మల్లికార్జున (నాగండ్ల) రేణుక(చీరాల) సంతానం

కరుభుక్త సన్యాసప్పడు, లక్ష్మిపురం, గవర్నమెంట్‌ జాబ్‌

కోటయ కరుణాకర్‌, (సింహరాశీ) గవర్నమెంట్‌ జాబ్‌

హోకవరపు పవన్‌ కుమార్‌, ఉద్యోగంలో స్థిరత్వం, 31/07/1989

వెంటరెడ్డి కారుమూరు, మండూరు, 18-10-1983

రాజేష్‌ కుమార్‌ పిళ్లై, 20-07-1976, విదేశ గమనం

దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.

14. హెడ్డింగ్‌ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారి పేర్లు ఇవి.

రాం. పెద్దనందిపాడు, స్వంతిల్లు

వాసు కొల్ల, చీరాల, ఉద్యోగం

యాసం అశోక్‌, సంపాదన 26/03/1991

అనిల్‌ కుమార్‌ నాతాని, రావినూతల, ఆరోగ్యం, ఆర్థిక స్థితి

సి. నాగరాజ్‌, చిత్తూరు, దోషాలు (ఏపరంగానో చెప్పలేదు)

వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్య గురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)

15. కెరియర్‌ గురించి, భవిష్యత్‌ గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.

సర సుబ్రహ్మణ్యం, పిఠాపురం

యాసం అశోక్‌ కుమార్‌, 26/03/1991

శివ రాం కిశోర్‌, 18-12-1986

ధనుంజయ రావు, 29.12.1990

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+