మీ ప్రశ్నలకు జ్యోతిష్కుడేమంటున్నారు?

1. అపర్ణ, నల్గొండ, ఉద్యోగం

మీకు వృత్తిస్తానాధిపతి శని,8వఅధిపతి గురునితో కలిసి6లో ఉన్నాడు, 6వ భావంలో శనిసూర్యులున్నారు, అష్టక వర్గులో మీకు లగ్నంలోనే బలం తక్కువగా ఉంది, ప్రస్తుతం రాహువు దశ నడుస్తుంది, గోచారంలో గురుబలం ఉంది కానీ అర్ధాష్టమ శని ,రాహుకేతువుల ప్రతికూలత ఎక్కువగా ఉంది, మొత్తం కుదురుకోవడానికి ఎక్కువ కాలం పడుతుంది కానీ, వచ్చే మార్చి తర్వాత కొంత ఆశించి ప్రయత్నించ వచ్చు. పైన చెప్పిన గ్రహాలకి దానాలు చేస్తూండండి.

2.జి.పవన్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం నాకు వస్తుందా?

మీరు పుట్టిన సమయం, చోటు రెండూ రాయలేదు, మీ ప్రశ్నకూడా సరిగా లేదు అసలు సమస్యేంటో రాయలేదు. ముందు ఈ జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనే ఆర్టికల్‌ చదివి పంపండి.

3. షణ్ముఖిదేవి పావులూరి, నరసారావుపేట, వివాహం

పుట్టిన సమయం రాయలేదు, నక్షత్రమూ రాయలేదు. అవి ఉంటే పరిశీలించవచ్చు. కానీ పేరునిబట్టి కొంత చెప్పగలం, పేరునిబట్టి హస్తనక్షత్రం కన్యారాశి. మరొక సంవత్సరంవరకూ గురుబలం లేదు, రాహుకేతువులు వివాహభావానికి అడ్డంకుగా ఉన్నారు. వాటికి దానాలు చెసుకోండి.

what Astrologer says on your doubts?

4. బందకవి గొల్లంరాజు, పుట్టిన చోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం

మీకు జాతకానుసారంగా ప్రభుత్వోద్యోగానికి అడ్డంకులు ఎక్కువగా, అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

5. యర్రగొండ చందు, ప్రేమవివాహం, పోలీస్‌ ఉద్యోగం వస్తుందా?

మీరుపుట్టినసమయం,చోటు రెండూ రయలేదు,మీప్రశ్నకూడా సరిగా లేదు అసలు సమస్యేంటో రాయలేదు.ముందు ఈజవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్‌ చదివి పంపండి.

6. నరసింహారావు, కెరియర్‌

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయంగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

7.రుష్యేంద్ర బందరు, అరకు, వివాహం

శతభిష నక్షత్రం(కుంభరాశి) వివాహభావానికి శని, బుధ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంది. గురుబలం ఇప్పుడు పెళ్లికి అనుకూలంగా ఉంది కానీ రాహుకేతువుల దుష్ప్రభావం వచ్చే సంవత్సరం మార్చి వరకు ఉంటుంది. దశ గురుడిలో రాహువు జూలై 2016 వరకూ ఉంది. ఆ తర్వాత కొంతకాలం అనుకూలంగా ఉంది. పై గ్రహాలకి దానాలు, పరిహారాలు చేసుకోండి.

8. రామకుమార్‌, కెరియర్‌

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

9. లక్ష్మీకుమార్‌ రెడ్డి,మదనపల్లె, రాజకీయ జీవితం

మీకు ఫాలో యింగ్‌ ఉంటుంది. కానీ అంత మంచి వృద్ధిలేదు. 9లోరాహువు, దశమంలో వ్యయాధిపతి శుక్రుడున్నాడు. ఆశాజనకంగా ఉంటుంది కానీ అభివృద్ధి మెల్లిగా ఉంటుమది.

10. బాల ఐశ్వర్య, అమలాపురం, దాంపత్యసమస్య

మీ జాతకంలో 7వఅధిపతి బుధుడు3లో రాహునక్షత్రం మీదున్నాడు, గోచారం బాగాలేదు, కానీ మీ భర్త జాతకం ఇలాగే ఇంకా జటిలంగా ఉంది. వివాహకారకుడు బుధుడు 8వఅధిపతి ఐన శుక్రుని నక్షత్రం మీదున్నాడు. 8వఅధిపతి శుక్రుడు లగ్నంలోఉండి 7ని చూస్తున్నాడు. శుక్రుడి దశ నడుస్తుంది. 2012 సెప్టెంబర్‌ నుంచి ఆతని స్వభావం మారి ఉండవచ్చు. ఇప్పుడు చేయగలిగిందల్లా వారానికొకసారి లేదా రెండుసార్లు పైగ్రహాలకి దానాలుచేస్తూ, (ఆపదాం అపహర్తారందాతారం సర్వసంపదాం, లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం) అనే శ్లోకం ఎక్కువగా జపిస్తూండండి. దానాలు ఏం చేయాలో ఈ జవాబుల కింద 'నవగ్రహాలకి పరిహారాలు అనే ఆర్టికల్‌లో అందించాం.

11. ఐశ్వర్య తేజ.వి, మధిర(ఖమ్మం) విదేశగమనం

మీకు విదేశగమనానికి అవకాశం ఉంది. అందునా ఇప్పుడు మంచి సమయం నడుస్తుంది.

12. రవికుమార్‌, హైదరాబాద్‌

మీరు పుట్టిన తేదీని 2015గా ఇచ్చారు సరి చూసుకోండి. ప్రశ్న చిన్నగా రాయండి.

13. వెంకట దుర్గాప్రసాద్‌, నర్సాపుర్‌, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి కొంత అవకాశం ఉంది, కానీ వచ్చేసంవత్సరం గురుబలం ఉంది, కానీ చంద్ర, కుజ, గురు, రాహు గ్రహాల ఆటంకాలెక్కువగా ఉన్నాయి. ఇందులో మీ పొరపాట్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని దిద్దుకోవాలి. పై గ్రహాలకి దానాలు చేస్తూమడండి.

14. రాజు(రామత్రినాథ్‌కట్ట) పుట్టిన చోటు, సమయాలు రాయలేదు, ప్రభుత్వోద్యోగం

మీరు పుట్టిన సమయం రాయకుండా చెప్పడం కుదరదు. పుట్టిన సమయం పంపండి.

15. పోచారెడ్డి గిరీష్‌, నెల్లూర్‌, ఉద్యోగం

9కి సూర్యుడు, దశమానికి బుధుడు వీళ్లిద్దరూ ద్వాదశంలో ఉన్నారు, గోచారంలో, దశలోనూ వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌ తర్వాత బాగుంటుంది. పైగ్రహాలకి దానాలు చేస్తూండండి. శ్రీరాజమాతంగ్యైనమ: అని జపిస్తూండండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+