వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి ? పురోహితులు ఏం చెప్తున్నారు ..?

|
Google Oneindia TeluguNews

జూన్ 28 వ తేదీ వరకు అనేక శుభకార్యాలకు,పెళ్లిళ్ల సీజన్ నడిచింది. ఒకే ఒక్క రోజు వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. జూన్ 29 నుండి ముహుర్తాలు లేవు .జులై 2 వ తేదీ అమావాస్య అవుతుంది.అమావాస్యకు ఐదు రోజుల ముందు నుండి ఏ ముహుర్తాలకు అనుకూలం కాదు.

జులై 3 తేదీ నుండి ఆషాఢమాసం ప్రారంభం అవుతుంది.

జులై 9 తేదీ నుండి శుక్ర మౌడ్యమి ప్రారంభం అయ్యి తేదీ 19 సెప్టెంబర్ 2019 వరకు శుక్ర మౌడ్యమి ఉంటుంది.

మూఢమి ప్రవేశంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు దాదాపు మూడు నెలలపాటు ఉండవు .

 astrology july shubh muhurat

ఏటా వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉండేవి.

జూలై ఆషాఢ మాసం కావడంతో శూన్యమాసం అయ్యింది.

ఆ కారణం చేత శాస్త్రీయ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని శుభకార్యాలు జరగబోవు .

ఈ ఏడాది శ్రావణ మాసంలో కూడా మూఢమి వచ్చింది. సెప్టెంబర్‌ భాద్రపద మాసం కావడంతో శూన్యమాసమయ్యింది.మూడు నెలలు శుభకార్యాలకు ఆటంకం ఏర్పడింది.సెప్టెంబర్ 30 నుండి ముహూర్తాలు మొదలవుతాయి.

English summary
the wedding season ran until June 28th. Hundreds of weddings took place in a single day. No muhurthas from June 29th to 3 months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X