నవంబర్ ముహూర్తాలు: పెళ్లి ఆలస్యమైతే..

వివాహ సమస్యలకు సంతాన సమస్యలకు కుజదోష సమస్యలకు మంచి పరిష్కారం మార్గశిర విశేష సుబ్రహ్మణ్య షష్టి 27, 28 నవంబర్‌ 2014

వివాహం ఆలస్యమైనవారు, అవుతుందేమో అనుకునేవారు, సంతానం ఆలస్యమైనవారు, సంతాన లోపం ఉండ కూడదనుకునే వారు,పుణ్యబలాన్ని దేశాన్ని కాలాన్ని బట్టి సంపాదించుకొవాలి.అలాంటి మంచికాలం మార్గశిర శుద్ధ షష్ఠి 27, 28 నవంబర్‌ 2014 లలో ఉంది.భక్తి విశ్వాసాలుగలవారు ఆచరించవచ్చు.

విధానం : 27 (గురువారం) ఉదయం తలస్నానం చేసి సుబ్రహ్మణ్య పటం లేదా సర్పరూపంలో, అష్టోత్తరం లేదా సహస్ర నామాలతో షోడశ ఉపచారపూజ చేయాలి, ఉపవాసం ఉండాలి.

Jyothisham: November muhurtaasa

పిండివంటల నైవేద్యం చేసి తాముతిని ఇతరులకు పంచాలి.

28 (శుక్రవారం) రెండవరోజు శక్తికొద్దీ పూజాదులు లేదా ఉత్సవాలు జరపవచ్చు. సుబ్రహ్మణుడి స్వరూపంగా సంధ్యావందనాదులు పాటించే బ్రహ్మచారి బ్రాహ్మణుడికి వస్త్రసమేతంగా బంగారంతోగానీ,వెండితోగానీ చేసిన పాముప్రతిమ లేదా ఉంగరం దానం చేయవచ్చు. వీలైనంత ఎక్కువ మందియాచకులకు కందిపప్పుతో వండిన పదార్థం కలిపిన అన్నం దానం మాత్రం తప్పకుండాచేయాలి.

ఎక్కువసేపు సుబ్రహ్మణ్య స్త్రోత్రాలు పారాయణచేయడం వల్ల మంచిఫలితం వస్తుంది.

జాతకాలల్లో కాలసర్ప దోషం ఉన్నవారికి,కుజదోషం ఉన్నవారికి, మాంగళ్యదోషం ఉన్న వారికి వాట వాటి పరిహారాలు శాంతులు చేయడానికి ఈరెండురోజులు చాలా మంచివి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+