సముద్ర గర్భంలో వింత జీవి విన్యాసాలు! అద్దం చూసి వేటాడే ఆక్టోపస్‌లు..

సముద్ర గర్భంలో జీవించే ఆక్టోపస్‌ల తెలివితేటలు చూసి శాస్త్రవేత్తలే ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా డార్ట్‌మౌత్ శాస్త్రవేత్తలు చేసిన ఒక ఆసక్తికర అధ్యయనంలో ఆక్టోపస్‌లకు ఉన్న అద్భుతమైన మేధస్సు వెలుగులోకి వచ్చింది. అద్దాలను ఉపయోగించి, తమకు నేరుగా కనిపించని చోట దాగి ఉన్న ఆహారాన్ని కూడా ఇవి సులభంగా గుర్తించగలవని ఈ పరిశోధన నిరూపించింది. గతంలో ఇలాంటి తెలివితేటలు కేవలం మనుషులు, కోతులు లాంటి క్షీరదాలు, కొన్ని రకాల పక్షులలో మాత్రమే కనిపించేవని, కానీ ఇప్పుడు ఆక్టోపస్‌లు కూడా ఈ రికార్డు సృష్టించాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

డార్ట్‌మౌత్ ఆక్టోపస్ ల్యాబ్‌లో పరిశోధకులు 'కాలిఫోర్నియా టూ-స్పాట్' అనే ప్రత్యేక జాతి ఆక్టోపస్‌లపై ఈ పరీక్షలు చేశారు. ఆక్టోపస్‌లకు వాసన చూసే శక్తి చాలా ఎక్కువ. కాబట్టి ప్రయోగంలో వాసన ద్వారా కాకుండా కేవలం అద్దం చూసి మాత్రమే అవి ఆహారాన్ని గుర్తిస్తున్నాయా? లేదా? అని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక ఉపాయం ఆలోచించారు. నిజమైన పీతకు బదులుగా స్క్రీన్‌పై కనిపించే ఒక 'వర్చువల్ పీత' బొమ్మను ఉపయోగించారు. ఆక్టోపస్‌ను ఒక పెట్టెలో ఉంచి, దానికి ఎదురుగా అద్దాన్ని పెట్టారు. ఆక్టోపస్‌కు వెనుక వైపు ఉన్న పీత బొమ్మ కేవలం ఎదురుగా ఉన్న అద్దంలో మాత్రమే కనిపిస్తుంది. ఆహారాన్ని అందుకోవాలంటే ఆక్టోపస్ అద్దాన్ని చూసి, వెనక్కి తిరిగి సరైన దిశలో వెళ్లాల్సి ఉంటుంది.

Dartmouth Study Reveals Octopuses Use Mirrors To Locate Hidden Food With Incredible Spatial Thinking
సముద్ర గర్భం నుంచి అశుభ సూచకం: ప్రళయ చేప ప్రత్యక్షం!
సముద్ర గర్భం నుంచి అశుభ సూచకం: ప్రళయ చేప ప్రత్యక్షం!

డ్రైవర్ల లాగే నేర్చుకున్నాయి!

శాస్త్రవేత్తలు ఇచ్చిన కొద్దిపాటి శిక్షణ తర్వాత, ఆక్టోపస్‌లు అద్దంలో చూసి సుమారు 73 శాతం సందర్భాల్లో ఆహారం ఉన్న చోటును కరెక్ట్‌గా గుర్తించాయి. రోజులు గడిచేకొద్దీ అవి మరింత వేగంగా ఆహారాన్ని చేరుకోవడం విశేషం. ఈ ప్రాజెక్ట్ సీనియర్ రచయిత ప్రొఫెసర్ పీటర్ త్సే మాట్లాడుతూ.. "మనుషులు పుట్టగానే అద్దం వాడటం నేర్చుకోరు. మనం కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు వెనుక వచ్చే వాహనాలను చూడటానికి రియర్ వ్యూ మిర్రర్‌ను ఎలా వాడుతామో, ఆక్టోపస్‌లు కూడా అలాగే అద్దాన్ని ఉపయోగించి పరిసరాలను అంచనా వేయడం నేర్చుకున్నాయి" అని వివరించారు.

ప్రపంచం వణికిపోయే దారుణం.. సంద్రం కాదది రక్తపు టేరు!
ప్రపంచం వణికిపోయే దారుణం.. సంద్రం కాదది రక్తపు టేరు!

పరిసరాలపై 'మెంటల్ మ్యాప్'

ఈ పరిశోధన వివరాలు ప్రముఖ 'కరెంట్ బయాలజీ' పత్రికలో ప్రచురితమయ్యాయి. వెన్నెముక లేని జీవులు (అకశేరుకాలు) అద్దాలను ఉపయోగించి తమ వాతావరణాన్ని అర్థం చేసుకోగలవని నిరూపణ కావడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ అధ్యయన ప్రధాన రచయిత్రి మేరీ కీసెలర్ మాట్లాడుతూ.. ఆక్టోపస్‌లు పిల్లుల మాదిరిగా వేటాడతాయని, శత్రువుల నుంచి తప్పించుకోవడానికి వాటి మైండ్‌లో పరిసరాల గురించిన ఒక 'మెంటల్ మ్యాప్' ఉంటుందని ఈ ప్రయోగం ద్వారా అర్థమవుతోందని చెప్పారు. 2016లో న్యూజిలాండ్ అక్వేరియం నుంచి 'ఇంకీ' అనే ఆక్టోపస్ డ్రైన్‌పైప్ ద్వారా సముద్రంలోకి పారిపోయి గతంలోనే సంచలనం సృష్టించింది. తాజా పరిశోధనతో సముద్రపు జీవులన్నింటిలో ఆక్టోపస్‌లే అత్యంత తెలివైనవని మరోసారి రుజువైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+