శ్రీరామనవమి విశిష్టత, పూజా విధానం, శ్రీరామనవమి వ్రతాన్ని ఆచరిస్తే చెయ్యాల్సిందిదే!
హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ శ్రీరామనవమి పండుగ. ఈ పండుగను చైత్ర మాసం శుక్లపక్ష నవమి నాడు శ్రీరామచంద్రుడు పుట్టిన రోజున జరుపుతారు. ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరపడానికి దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలను సిద్ధం చేస్తున్నారు. అయోధ్యలోని రామ మందిరం తో పాటు, భద్రాచలంలో శ్రీ సీతారామస్వామి దేవాలయం శ్రీరామనవమి వేడుకలకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది.
రామయ్య పుట్టినరోజు
అయోధ్య రాముడు, దశరథ తనయుడు, సకలకళా గుణాభిరాముడు అయిన శ్రీరామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్ర యుక్తమైన కర్కాటక లగ్నంలో, అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడని చెబుతారు. శ్రీరామచంద్రుడిని శ్రీమహావిష్ణువుకు అవతారంగా చెబుతారు. శ్రీరాముడు లోకకళ్యాణార్థం రామచంద్రుని అవతారం ఎత్తి లోకానికి ఎన్నో విలువలను నేర్పించాలని, ఎంతో ఆదర్శప్రాయమైన జీవితాన్ని ప్రజలకు చూపించాడని చెబుతారు.

సీతారాముల కళ్యాణం కూడా శ్రీరామ నవమి నాడే
ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా సాగిన శ్రీరామచంద్రుని జీవితం నేటికీ ఎంతోమందికి అనుసరణీయంగా మారిందని చెబుతారు. ఈ రోజు శ్రీరామచంద్రుడి జననం మాత్రమే కాదు ఆయన కళ్యాణం కూడా జరిగిందని ఎంతో విశేషంగా చెబుతూ ఉంటారు. సహజంగా సీతారాముల కల్యాణాన్ని ప్రతి సంవత్సరం వాడవాడలా అత్యంత ఘనంగా ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తారు. లోక కళ్యాణం కోసం సీతా రామచంద్రుల కళ్యాణాన్ని నిర్వహించడం విశేషం.
శ్రీరామనవమి పూజకు చెయ్యాల్సిందిదే
ఎవరైతే శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి వ్రతాన్ని ఆచరించాలి అని భావిస్తారో వారు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాలని చెబుతారు. శ్రీరామనవమి పండుగ నాడు ప్రతి ఒక్కరు శ్రీరామనవమి పూజను ఆచరించడానికి విధివిధానాలను తప్పనిసరిగా పాటించాలి. పండుగ రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసి, తలస్నానం చేసి ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్యం మూలలో ఒక అందమైన మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
రామయ్య పూజా విధానం ఇదే
ఇక ఆ మండపంలో శ్రీరాముడి పట్టాభిషేక చిత్రాన్ని కానీ, సీతారామ, లక్ష్మణ, హనుమాన్లు ఉన్నటువంటి చిత్రాన్ని కానీ పెట్టి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలి. శ్రీరామనవమి పండుగ రోజు పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు, గంగా జనంతో రామయ్యకు పూజలు చేయాలి. శ్రీరామచంద్రమూర్తికి ఎర్రటి పూలు ఎంతో ఇష్టం కాబట్టి ఎర్రటి పూలను స్వామివారి పాదాలపై ఉంచి పూజించాలి.
నైవేద్యంగా వీటిని పెట్టాలి
శ్రీరాముని పూజించే ముందుగానే హనుమంతుడికి పూజ చేయాలి. ఇక ఆ తర్వాత రాములవారికి పూజాదికాలు నిర్వహించాలి. శ్రీ రామచంద్రమూర్తికి నెయ్యిదీపాన్ని వెలిగించి, కర్పూర హారతి ఇవ్వాలి. శ్రీరామచంద్రమూర్తి కి అత్యంత ఇష్టమైన సీతాఫలాన్ని నైవేద్యంగా నివేదించాలి. స్వామివారికి పానకం, వడపప్పు, కొబ్బరి నైవేద్యంగా పెట్టి పూజలు చేయాలి. మంచి ఎండాకాలంలో వేడి సమయంలో నిర్వహించుకునే పండుగ కాబట్టి పానకం, వడపప్పు మన శరీరంలో వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తాయని చెబుతారు.
శ్రీరామ వ్రత దీక్షను ఆచరించే వాళ్ళు చెయ్యాల్సిందిదే
ఇక శ్రీరామనవమి వ్రత దీక్షను ఆచరించేవారు స్వామిని పూజించే ఉపవాస దీక్షను పాటిస్తే చాలా మంచిదని చెబుతారు. శ్రీరామచంద్రుడి మూల మంత్రాన్ని పాటిస్తూ, రామ కథను చదువుకుంటూ, ఉపవాస దీక్షను ఆచరిస్తే రామయ్య కటాక్షం తప్పనిసరిగా ఉంటుందని చెబుతారు. పాలు, పండ్లను ఆహారంగా తీసుకుని రోజంతా శ్రీరాముడి పైనే మనసును లగ్నం చేసి శ్రీరామనవమి వ్రతాన్ని ఆచరించే వారికి శ్రీరాముడితో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుందని చెబుతారు.
శ్రీరామ నవమి వ్రతం చేస్తే కలిగే ఫలితాలివే
ఎవరైతే శ్రీరామనవమి వ్రత దీక్షను ఆచరిస్తారో వారు దానాలు చేస్తే ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు అన్నదానం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయని చెబుతారు. అనారోగ్యంతో బాధపడేవారు, వృద్ధులైన వారు, ఉపవాసం చేయలేనివారు ఒకపూట భోజనం చేసి శ్రీరామనవమి వ్రతాన్ని కొనసాగించవచ్చని చెబుతున్నారు. శ్రీరామనవమి పండుగ రోజు నిష్ఠతో ఉపవాస దీక్షలతో జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, ముక్తిని పొందుతారని భక్తులు విశేషంగా నమ్ముతారు.
శ్రీరామనవమి నాడు ధనలాభం కోసం ఇలా చెయ్యాలి
శ్రీరామునికి అంకితం చేయబడిన పండుగ అయిన శ్రీరామనవమి రోజు ధన లాభం కలగాలి అని కోరుకునేవారు శ్రీరామనవమి రోజు సాయంత్రం ఒక గిన్నెలో నీటిని తీసుకుని రామరక్షా మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః అని 108 సార్లు జపిస్తే, ఆ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లుకుంటే ధన లాభం కలుగుతుందని చెబుతున్నారు.
సంతోషం, వివాహ యోగం కోసం రామ నవమి నాడు ఇలా చెయ్యండి
అంతేకాదు సంతోషం మరియు శాంతి కోసం రామాలయం ధ్వజస్తంభం ఎదురుగా నెయ్యి దీపం లేదా నూనె దీపాన్ని వెలిగించి శ్రీరామ జయరామ జయజయరామ అని 108 సార్లు జపిస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఇక వివాహంలో అడ్డంకులు తొలగిపోవడానికి శ్రీరామనవమి రోజు సాయంత్రం సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించి సీతారామ అని 108 సార్లు జపిస్తే వివాహ యోగం కలుగుతుంది.
సంతానం కోసం, ఆరోగ్యం కోసం ఇలా చెయ్యండి
ఇక సంతానం కోసం ఒక కొబ్బరికాయను తీసుకుని ఎర్రటి గుడ్డలో చుట్టి సీతాదేవికి సమర్పించి ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఫలితం ఉంటుంది.. ఆరోగ్యం కోసం శ్రీరామనవమి రోజు సాయంత్రం హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పఠించి ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆరోగ్యం బాగుపడుతుంది అని చెబుతారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications