వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హేవలంబి నామ సంవత్సరం: ధను రాశి ఫలాలు

హేవలంబి ఉగాది నామ సంవత్సరంలో ఏ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనే వివరాలను ప్రముఖ జ్యోతిష్కుడు వన్ ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా అందించారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

ధను రాశివారు (మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 వపాదం)

ఆదాయం -11 వ్యయం - 5 రాజ్యపూజ్యం -7 అవమానం - 2

గురుడు సెప్టెంబర్‌ వరకు కన్యలో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఈ దశ మీ జీవితములో కష్టాల్ని తెస్తుంది. మీరు చెడ్డ తనముతో ఆలోచిస్తారు. కొన్ని పనులు పూర్తి కానందున మీకు అసహనముగా ప్రవర్తిస్తారు. శాంతిగా ఉండుటకు ప్రయత్నించాలి, లేదా అసంతృప్తి మిమ్మల్ని వేధిస్తుంది. ఇంట్లో పెద్ద వారితో, ఉద్యోగములో పై అధికారులతోను వాదనలకు దిగకుండా ఉండుటకు ప్రయత్నించాలి. జాగ్రత్తగా లేనిచో మీ పదవి పోగొటుకొని, గౌరవాన్ని కూడా పోగొటుకొని, ఇష్టము లేని దూర ప్రాంతాలకు బదలీ అవుతారు. ధనమును, ఆసులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శారీరక శ్రద్ధ అవసరము, ඩීහූළු ఆరోగ్య భంగము, కండ్ల జబ్బులు, మరియు గొంతునొప్పి వంటివి సంభవము. ఆరోగ్యముపై ప్రత్యేక శ్రద్ధ అవసరము, లేనిచో నిరుత్సాహము, నిస్సత్తువ వంటివి సంభవము. మీ అశ్రద్ధ వలన మీ పిల్లలు అనారోగ్యమునకు గురి కాగలరు. వారి ఆరోగ్యానికి హాని ముంచుకొస్తుంది.

11 సెప్టెంబర్‌ నుండి గురుడి తులలో సంచరించుట వలన. ఇది మీకు మంచి కాలము. ఈ సమయములో ఉద్యోగములో ఉన్నత పదవి, వ్యాపారములో లాభము, ఉన్నత స్థాయి లభిస్తాయి. సంఘములో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి సమయము, శారీరకముగా, మానసికముగా చక్కగా ఉండి, అందరు మిమ్మల్ని గుర్తించే విధముగా ప్రవర్తిస్తారు. స్నేహితుల నుండి, అయిన వారి నుండి లాభము, శత్రు నాశనము కలుగును. దైవ కార్యముల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఎల్లప్పుడు దైవ చింతన చేయుట వలన శక్తి లభిస్తుంది. పెళ్లికాని వారికి వివాహము, వివాహితులకు సంతాన యోగ్యము, కొందరికి అన్యస్త్రీతో శృంగారము సంభవించును. ఆర్ధికముగా బాగుండి, స్థలము, ఆభరణాలు, వాహనాలు, వస్తువుల కొనుగోలు, విలాసవంతమైన జీవితము గడుపుదురు. ఆరోగ్య లాభము మరియు శాంతిగా ఉండుట జరుగవచ్చును.

The Raasi Phalas of Hevalambi danurasi

శని 07ఏప్రిల్‌ నుండి ధనులో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. కష్టకాలము, ధనవ్యయము, అనవసరమైన ఖర్చులు, అనవసర ఋణములు చేయరాదు. నిదాశావాదిగా వ్యవహరిస్తారు. ఏ పని తలపెట్టినా అడ్డకులు ఎదురగును. కొందరు జైలుకు కూడా వెళ్లవలసి వచ్చును. ఆరోగ్యముపై శ్రద్ధ చూపగలరు. ప్రమాదాలకు, రోగములకు గురి కాగలరు. బహు జాగ్రతమతగా ఉండుటకు ప్రయత్నించగలరు. జీవిత భాగస్వామి ఆరోగ్యము కూడా మందగించును. శిరోవేదన, శక్తి తగును, ఉత్సాహము నశించును, మనశ్శాంతి ఉండదు. వృత్తి వ్యవహారములలో ఇబ్బందులు, వృత్తి వ్యవహారములలో జాగ్రత్తగా మసలుకొనవలెను. ప్రయాణములు సంభవించును. బహుదూర ప్రయాణములు చేయవలసి ఉండవచ్చును. వేరే దేశమునకు/ప్రాంతమునకు బదిలీలు కలుగవచ్చును,
శని21 జూన్‌ వృశ్చిక సంచారం వలన, ఈ దశలోఖర్చులు ఎక్కువవుతాయి, ఆర్థిక పరమైన ఇబ్బందులు, అనవసరమైన ఖర్చులు చేయుదురు.

వ్యవసాయదారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపవలెను. శత్రువుల వలన ధన నష్టము సంభవించవచ్చును. ధనమును మితముగా ఖర్చుచేయవలెను. ఆరోగ్య శ్రద్ళ అవసరము, భార్యా, పిల్లల ఆరోగ్యముపై శ్రద్ధ వహించాలి. కాళ్లు, నేత్ర రోగములు వచ్చే అవకాశము ఉండవచ్చును. వృత్తి వ్యవహారముల యందు శ్రద్ధ అవసరము. జాగ్రత్తగా మసలు కొనవలెను. వృత్తి వ్యవహారములలో కొన్ని మార్పులు చేస్తారు. ప్రయాణాలు సంభవము, వేరే దేశ ప్రయాణాలు ఉండవచ్చును. కాని, చాలా వ్యయముతో కూడుకున్నదిగా ఉండవచ్చును. అయిన వారితో విరోధములు, శాంతిగా ఉండాలి. జీవితములో నిరుత్సాహము పొందగలరు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొన్నపుడు ప్రత్యేకమైన జాగ్రత్త అవసరము. నిర్లక్ష్యముగా పని చేస్తారు. మీకు అపఖ్యాతి తెచ్చే ఏ పని చేయరాదు.

శనిఅక్టోబర్‌ 25నుండి ధనూరాశి సంచారం వలన. అందువలన అయిన వారికి, అందరికి దూరముగా ఉండవలసి వచ్చి, కష్టముగా ఉండవచ్చును. గృహమునందు శాంతిగా వ్యవహరించాలి. గృహములో సోదర వర్గముతో వాదనలకు దిగుతారు, దాని వలన భార్యా, పుత్రులకు ఇబ్బందులు కలుగవచ్చును. కావున, గృహ కలహముల నుండి భార్యా, పుత్రులను దూరముగా ఉంచాలి. మరణ వార్తలు విందురు. బంధు వర్గము వారి మరణము సంభవించును. అందరికి దూరముగా ఉండుట వలన విలువైన స్నేహితులు దూరమగుదురు. ఈ కాలవలో చాలా జాగ్రత్తగా మసలు కొనవలెను, లేనిచో కష్టముల పాలగుదురు.

ఆగస్ట్‌ 18 వరకు రాహువు సింహరాశి సంచారం వలన, . స్నేహితులతోను, తెలిసిన/అయిన వారితో చక్కగా మెలగవలెను, లేనిచో వారు మిమ్మల్నిదూరముగా ఉంచుదురు. గ్రహ బలముచే తల్లిదండ్రులతోను, సోదర వర్గముతోను విరోధము, ఈ సమయములో చెడ్డ స్నేహములు పనికి రావు. ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. కేతువు తృతీయమునందు ప్రవేశము:- మీలో కొంతమంది గణిత శాస్త్రమును చక్కగా అభ్యసించగలరు. ప్రయాణములు సంభవించే అవకాశము ఉండవచ్చును. నౌకాప్రయాణము చేయవచ్చును. కాని కొండ ప్రాంతములలో/ఎత్తైన ప్రాంతములలో ప్రయాణించువారికి చేతబడులచే హాని సంభవించే అవకాశము ఉండవచ్చును.

ఆగస్ట్‌ 18 నుండి రాహువు కర్కాటకరాశి సంచారం వలన, ఈ దశ ఆరోగ్యానికి హానికరమైనది. ఆరోగ్యముపై ప్రత్యేక శ్రద్ధ అవసరము. అంటు రోగములు, శృంగార రోగములు వచ్చు అవకాశమున్నవి. భీతి, ఆరోగ్య భంగము, ఎవరైతే 'మరక దశలో వారి జన్మరాశిలో వెళ్లారో వారు కోరి ప్రమాదములు తెచ్చుకొనగలరు. వృత్తి వ్యవహారములలో చెడ్డగా ప్రవర్తించిన, లంచము తీసుకొన్న జైలు శిక్ష అనుభవించే అవకాశమున్నది. అపవాదములు కలుగవచ్చును. కేతువు ద్వితీయమునందు ప్రవేశము:- అగ్ని ప్రమాదాలకు దూరముగా ఉండవలెను. వైవాహిక జీవితములో భాగస్వామితో గొడవపడతారు. దీని వలన అత్తవారితో చెడ్డగా ప్రవర్తిస్తారు. స్థాన చలనము వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనవసర విషయాలలో తలదూర్చి, నష్టాలను కొని తెచ్చుకుంటారు.

మకర రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండిమకర రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

English summary
The Raasi Phalas of Hevalambi raasi Phalas have been given by the astrolger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X