హేవలంబి నామ సంవత్సరం: సింహ రాశి ఫలాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

సింహం రాశివారు (మఖ 4పాదాలూ, పుబ్బ 4 పాదాలూ, ఉత్తర 1 వపాదం)

ఆదాయం - 2 వ్యయం - 14 రాజ్యపూజ్యం -2 అవమానం - 2

గురుడు సెప్టెంబర్‌ వరకు కన్యలో వక్రమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. మంచి సమయము, అన్నింటా జయము, ధన లాభము, వృత్తి వ్యవహారములు, వ్యవసాయము కలసి వచ్చును. తద్వారా దానధర్మములు చేస్తారు. స్థలమును కొనుగోలు చేస్తారు లేదా పాత బాకీలు తీరుస్తారు. గృహమునందు సంతోషము, వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, వృత్తి వ్యవహారాలలో పైఅధికారుల అనుగ్రహము పొంది మిగతా వారికి ఆదర్శప్రాయువులు అవుతారు. శత్రుహాని, సంఘములో ఉన్నత స్థాయి, గౌరవ మర్యాదలు ప్రాప్తించును. మనస్సున శాంతి, తద్వారా మంచి బుద్ధితో ఆలోచన కలుగుతుంది.

The Raasi Phalas of Hevalambi simharasi

11 సెప్టెంబర్‌ నుండి గురుడి తులలో సంచరించుట వలన. ఈ దశ మంచిది కాదు. ఒడుదుడుకులు, ఇబ్బందులు, చేయు వృత్తుల యందు ధన నష్టము మరియు వృత్తి నష్టము. వృత్తి వ్యవహారములలో జాగ్రత్త అవసరము. పై అధికారుల నుండి ఇతర ఉద్యోగుల నుండి వ్యతిరేకము. సోదరులతోను, స్నేహితులతోను వాదోపవాదములకు దూరముగా ఉండగలరు. కొందరికి స్నేహితుడుగాని, బంధువుగాని దూరమగుదురు. మీ యొక్క, మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము మందగించి రోగములు సంభవించును, శరీర శ్రమ, ఆతృత మిమ్మల్ని కుంగదీయును.

ప్రయాణములను వాయిదా వేయవలెను. గృహములో శుభ కార్యములు చేయుదురు లేదా వివాహము జరుగవచ్చును.
శని 07 ఏప్రిల్‌ నుండి ధనులో వక్రగమనం వలన కింది ఫలితాల తీవ్రంగా ఉంటాయి. ఈ దశ బాధను కలిగించును, కారణము లేకనే కలహములు, బంధు, మిత్రులు, సజ్జనులతో విరోధములు, అన్యప్తి పరిచయము, దుడుకుగా వ్యవహరించుట వలన అపకీర్తి సంభవించును. పనియందు శ్రద్ధ అవసరము. పనిలో కొత్త నిర్ణయాలు తీసుకొన్నపుడు జాగ్రత్త అవసరము, షేరు మార్కెటు లాభించదు.

శని21 జూన్‌ వృశ్చిక సంచారం వలన, జాగ్రత్త అవసరము. ఆర్థిక పరముగా మంచిది కాదు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. వృత్తి వ్యవహారములందు ఆసక్తి, ఉత్సాహము తగును. వృత్తిని ఇష్టపడక పోవుటచే పైఅధికారుల వలన మాటలు పడుదురు. కొంతమందికి ఉద్యోగములో వేరే చోటికి బదిలీలు జరుగును. సంఘములో మంచిగా ప్రవర్తించుటకు ప్రయత్నించగలరు, 苏苔o ప్రతి పనియందు నిదానము అవసరము. శారీరక శ్రద్ధ అవసరము. ఉదరకోశ సంబంధ వ్యాధులు కలుగును. ప్రాణభీతి, భయము, మనోవేదన, ఆతృత కలుగును. తప్పుడు పనులు చేయుటకు అవకాశము కలదు. శత్రువులతో విరోధము తగదు. స్నేహితులు, అయిన వారు దూరమగుటకు అవకాశము ఉండవచ్చును.

గృహములోను భార్యా, పిల్లల ఆరోగ్య భంగములు, గృహములో అయిన వారికి మరణము సంభవించవచ్చును. అయిన వారితో విభేధాలు పనికి రావు. బంధువర్గములో మరియు గృహములో శత్రుత్వము పెరుగును. శత్రువులకు దూరముగా ఉండుట మంచిది. కొందరికి సంతాన అవకాశము కూడా ఈ దశలో కలుగవచ్చును.

శనిఅక్టోబర్‌ 25నుండి ధనూరాశి సంచారం వలన. కొత్త పనులు చేపట్టిన అనుకున్న ఫలితములు సాధించలేరు. సొంత ఆరోగ్యము, భార్యా, పుత్రుల ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. పిల్లల ఆరోగ్య విషయములో అశ్రద్ధ తగదు. మనశ్శాంతి ఉండదు. జీవిత భాగస్వామిపై అసహనము పెరుగును. గృహములో సుఖశాంతుల కోసము పాటు పడాలి. విధ్యారులు చదువులో వెనుకబడతారు.

ఆగస్ట్‌ 18 వరకు రాహువు సింహరాశి సంచారం వలన, ఈ దశలో విపరీతమైన చెడు మార్పులు వచ్చును. ధన నష్టము, దుబారా/అనవసరపు ఖర్చులు కలుగవచ్చును. శత్రువులతో జాగ్రత్తగా మెలగవలెను. అనుకోని ఇబ్బందులు వృత్తి వ్యవహారములలో సంభవించును. చెడు సహవాసములకు దూరముగా ఉండవలెను. శరీరముపై శ్రద్ధ అవసరము. కేతువు సప్తమమునందు ప్రవేశము:- బంధు వర్గముల వారితో మంచి ప్రవర్తనతో నడుచుకోవాలి. లేనిచో వారు విరోధులుగా మారుటకు అవకాశము ఉండవచ్చును. గృహమునందు మర్యాద పాటించి, భాగస్వామితో వాదనలకు దిగకుండా ఉండుటకు ప్రయత్నించాలి. భాగస్వామితో విరోధము, మిమ్మల్ని దూరము చేయుటకు తోడ్పడును. బంధు వర్గముల వారితో మంచి ప్రవర్తనతో నడుచుకోవాలి. లేనిచో వారు విరోధులుగా మారుటకు అవకాశము ఉండవచ్చును.
ఆగస్ట్‌ 18 నుండి రాహువు కర్కాటకరాశి సంచారం వలన, ఈ దశ ఇబ్బందైన దశ, వృత్తి వ్యవహారములలో నష్టము వాటిలును. ఎంతపని చేసినను అనుకున్న ఫలితాలు దక్కవు. ఇంతకు మునుపు చేపట్టిన పనులలో కూడా ఆటంకములు ఎదురు అగును. వృత్తి వ్యవహారములలో మనో నిబ్బరము, ధైర్యము అవసరము. మితముగా ఖర్చులు చేయడము మంచిది. లేదా ఋణ బాధలకు గురి కావచ్చును. ఆఖరికి స్థిరాస్థిని వదులు కోవలసి వచ్చును. స్థాన చలనమునకు కూడా అవకాశము ఉండవచ్చును. కేతువు షష్ఠమమునందు ప్రవేశము:- ఈ దశ మీకు మంచి కాలమును తెచ్చును. వ్యాపారస్తులకు మంచి కాలము. వ్యాపారములు కలసివచ్చును. వ్యవసాయదార్లకు, పశువులు కాయువారికి వారి రంగములలో ఆర్థిక లాభము సంభవించే అవకాశము ఉండవచ్చును. ఆర్థికముగా బాగుండును. వేరే వారికి ఋణములు ఇచ్చుట వలన ధన లాభము, ఆదర్శవంతులుగా అందరి వద్ద ఉండి ధనలాభము పొందుదురు. జయము సంభవించవచ్చును.

కన్య రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Raasi Phalas of Hevalambi raasi Phalas have been given by the astrolger.
Please Wait while comments are loading...