24 రోజులు ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే
ధనస్సు రాశిలోకి రాక్షస గురువు శుక్రాచార్యుడు ప్రవేశించడంవల్ల ప్రజలందరికి సానుకూలంగా లేదంటే ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. అయితే ఈ సంచారంవల్ల కొన్ని రాశులవారికి ఎన్నో ప్రయోజనాలు కూడా కలగనున్నాయి. ప్రేమ, ఆకర్షణ, కళ, సాహిత్యం, అందం, సంపద, వైభవానికి అధిపతి శుక్రుడు. 18వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు పోష శుక్ల పక్ష అష్టమి తిథి నాడు బృహస్పతి రాశిలోకి ప్రవేశించాడు. ఫిబ్రవరి 11, 2024 రోజు ధనుస్సు నుండి వృశ్చిక రాశికి బదిలీ అవుతాడు. ఈ 24 రోజులు కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారం కాబోతోంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
మేషరాశి
వీరికి పనిలో అదృష్టం తోడుంటుంది. ధైర్యం పెరగడంవల్ల గౌరవం వస్తుంది. ప్రేమ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు. భాగస్వామ్యంతో చేస్తున్న పనిలో బాధ్యతలు పెరుగుతాయి. అదనపు ఆదాయానికి వనరులు మరింత పెరుగుతాయి. వ్యాపారస్తులకు బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు.

వృషభ రాశి
శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపట్ల ఎంతో శ్రద్ధ వహించాలి. మూత్ర సమస్యలు పెరిగే అవకాశం కనపడుతోంది. సంపద పెరుగుతుంది. మాటలకు సంబంధించిన వ్యాపార రంగంలో పురోగతి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు. మనోబలం చాలా తక్కువగా ఉంది. ఏ పని తలపెట్టినా కాస్తంత ధైర్యాన్ని కూడగట్టుకొని రంగంలోకి దిగాలి.
మిథున రాశి
రోజువారీ ఆదాయం పెరుగుతుంది. దాంపత్య జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రేమ సంబంధాల్లో మెరుగుదల ఉంటుంది. జీవిత భాగస్వామితో గడపడానికి ఎక్కువ డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. జీవితంలో కళాత్మకత పెరుగుతుంది. చదువు, బోధనలో మంచి పురోగతిని సాధిస్తారు.
కర్కాటక రాశి
ఆనందంగా జీవించడానికి వనరుల కొరత ఏర్పడుతుంది. తల్లి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండటంవల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణ ఖర్చలు కూడా పెరుగుతాయి. వాహన, గృహానికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. అలర్జీ వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటారు.
సింహ రాశి
ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విద్యారంగంలో ఉన్నవారికి అనుకూలతలున్నాయి. గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ధైర్యసాహసాలను ప్రదర్శిస్తారు. తెలివితేటలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు.












Click it and Unblock the Notifications