Astrology: సెప్టెంబర్ 2023లో 5 ప్రధాన గ్రహాల సంచారం.. ఏం జరుగుతుందంటే!!
2023 సంవత్సరం సెప్టెంబర్ మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో అనేక కీలక గ్రహాల సంచారం ప్రాధాన్యతను సంతరించుకుంది. మనిషి జీవితం పైన ప్రభావం చూపించే గ్రహాల సంచారం సెప్టెంబర్ నెలలో కీలకం కానుంది. అన్ని రాశులపైన ప్రధాన గ్రహాల సంచార ప్రభావం పడనుంది.
వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల మార్పులు ద్వాదశ రాశుల వారి జాతకాల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో సెప్టెంబరు 2023లో ఐదు కీలక గ్రహాల స్థానాలలో గణనీయమైన మార్పులు సంభవించనున్నాయి. గ్రహాలలో ముఖ్య గ్రహాలైన సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు మరియు శని వివిధ రాశులలోకి సంచరించడం 12 రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. మరి సెప్టెంబర్ మాసంలో చోటు చేసుకునే గ్రహాల సంచారాన్ని గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

సెప్టెంబరు 4వ తేదీన మేషరాశిలో బృహస్పతి తిరోగమనం సంభవిస్తుంది. మేష రాశిలో బృహస్పతి తిరోగమనం కొన్ని రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలను, ఇంకొన్ని రాశులకు ప్రతికూలతలను కలిగిస్తుంది. సెప్టెంబరు నాలుగవ తేదీన కర్కాటక రాశిలో శుక్రుడు ప్రత్యక్షం కావడం కూడా వివిధ రాశుల వారి జాతకాల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మార్పు కొందరికి బాగా కలిసి వస్తే, కొందరికి సాధారణంగా ఉంటుంది.
సెప్టెంబరు 16 వ తేదీన సింహరాశిలో బుధుడు ప్రత్యక్షమవుతాడు. సింహరాశిలో బుధుడు ప్రత్యక్షం కావడం కొన్ని రాశులకు అదృష్టాన్ని, మరికొన్ని రాశులకు గ్రహాల స్థానాన్ని బట్టి దురదృష్టాన్ని కలిగిస్తుంది. ఇక సెప్టెంబర్ 17వ తేదీన కన్యారాశిలో సూర్యుడు సంచరిస్తాడు. కన్యారాశిలో సూర్య సంచారం కూడా 12 రాశుల వారి జీవితాల పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
ఆపై సెప్టెంబర్ 24వ తేదీన కన్యా రాశిలో కుజుడు దహనం అవుతాడు. కన్య రాశిలో కుజుడు దహనం కావడం కూడా కొన్ని రాశులకు మేలును మరికొన్ని రాశులకు అశుభాలను కలిగిస్తుంది. మొత్తంగా 5 ముఖ్యమైన గ్రహాల రవాణా ఈ నెలలో వివిధ రాశుల వారి జాతకాలను మారుస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications