Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తులా రాశి ఫలాలు 2017 సంవత్సరానికి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం

చిత్త 1,2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు, మీ పేరులో మొదటి అక్షరము రా, రి, రూ, రే, రో, త, తీ, తూ, తే అను అక్షరములలో ఒకటి అయినచో మీది తులారాశి.

చిత్త 1,2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు, మీ పేరులో మొదటి అక్షరము రా, రి, రూ, రే, రో, త, తీ, తూ, తే అను అక్షరములలో ఒకటి అయినచో మీది తులారాశి.

వృశ్చిక రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

Libra Horoscope

1) 2017 జనవరి:
శని ద్వాదశ సంచారంతో ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇది దీర్ఘకాల వ్యతిరేక ఫలితాలకు ఆరంభము, శతబాధలు, శతృవులు మిత్రులగుట, విద్యాభివృద్ధి, సంగీత సాహిత్యములు, కళలయందు ఆసక్తి, తలంచిన కార్యములు ఆలస్యమగుట, కుటుంబ సభ్యులతో గల గొడవలు దారికి వచ్చును. పెళ్ళికానివారు తమంతట తాము నిర్ణయాలు తీసుకోలేరు, మధ్యవర్తి పరిష్కారములు చేయుటలో ధైర్యము తక్కువ.

2) ఫిబ్రవరి:

గౌరవ భంగము, కృషి నాశనము, మనఃక్లేశము, గృహచ్ఛిద్రములు, నష్టము, దుఃఖము, దారిద్య్రము, తలపెట్టిన, ప్రారంభించిన పనులకు మొదట్లో ఆటంకములు ఎదురైనా క్రమేపీ పూర్తి చేయుట, నెరవేరుట జరుగును. వృత్తి వ్యాపారములలో లాభించుట, రాణించుట జరుగును. బంధు మిత్ర సమాగమము, పలుకుబడి - హోదాగల వ్యక్తుల పరిచయ భాగ్యములు ఏర్పడును. చేయుపనులలో అభివృద్ధి సాధించుట, లాభించుట జరుగును.

3) మార్చి:

భోజన సౌఖ్యభంగము, హేయమైన జీవనము, బంధుపీడ, శత్రు వృద్ధి, సంతాన అనారోగ్యం, కళత్ర విరోధము, సంఘములో గౌరవము, పలుకుబడి, రాజకీయములలో రాణించుట, తలంచిన కార్యములు జయము, చేయు కృషి వృద్ధిగా వుండుట, ధనలాభం, కుటుంబ సౌఖ్యము, బాకీలు వసూలగుట, కొత్త వ్యక్తులతో స్నేహములు, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, ఆడంబరముగా ఖర్చు చేయుట జరుగును. దైవభక్తి పెరుగును. ప్రయాణములు చేయునపుడు జాగ్రత్త అవసరము. నిర్లక్ష్యము పనికిరాదు.

4) ఏప్రియల్:

వివాదములు వంటి దోష ఫలితాలు కలుగును. వాడుకున్న వస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు. రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానం చేయడం మంచిది. ధన ధాన్య సమృద్ధి, చేయు పనులయందు అభివృద్ధి, ఆవులు, గేదెలు, పశు వులను, జంతువులను పెంచుట, పై అధికారుల వలన మాటలు పడుట, భయాందోళనలకు గురి అవుట, బలహీనత, అవయవములకు నొప్పలు, అనారోగ్యం, భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధములు, ఆడవారి వలన పనులు నెరవేరుట, ధనము సమకూరుట, పీడకలలు, భయం, దెబ్బలు తగులుట, ఎముకలు విరుగుట.

5) మే:

మిక్కిలి అనుకూల స్థానము, పుత్ర ప్రాప్తి, కళత్ర సౌఖ్యము, ధన లాభము, ఇష్టార్థ సిద్ధి, దేహారోగ్యము, ఉత్సాహము తగ్గుట, భార్య, పిల్లలతో చికాకులు, కన్ను ముక్కు చెవి, పంటికి సంబంధించిన బాధలు, అనారోగ్యం, పైవారి వలన మాటలు పడుట, ఉద్యోగస్తులకు చికాకులు, తలంచిన కార్యములకు ఆటంకములు, అపనిందలు, బంధువులతో విరోధము, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు సొమ్ము సమకూరి అవసరములు తీరును.

6) జూన్:

గౌరవము, అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యము, నిర్మలమైన మనస్సు, అనేక విధాలైన లాభములు కాలుగును. పెండింగు వ్యవహారములు పూర్తి అగుట, పాతబాకీలు వసూలగుట, భూ గృహ మార్పులు, వృత్తి ఉద్యోగ వ్యాపారములో ఊహించని మార్పులు, గర్వభంగం, ఇబ్బందుల నుండి కొంతవరకు తప్పించుకోగలుగుట. నూతన పధకములు ప్రారంభించుట, వాగ్దానములు నెరవేర్చ లేకపోవుట, విమర్శలకు గురి అవుట.

7) జూలై:

శుభఫలస్థానం ఫలితాలు వర్తిస్తాయి. ధన లాభము కలుగుతుంది, సంసారంలో సుఖము పొందుతారు, ఏ పని తలపెట్టినా ప్రారంభములో చికాకులు కలిగి కష్టముమిూద నెరవేరుట, అకారణ కలహములు ఏర్పడినా మధ్యవర్తుల ద్వారా అనుకూలంగా పరిష్కారమగుట, వ్యాపారాభివృద్ధి, ధనాదాయం, పాతబాకీలు వసూలగుట, ఆఫీసులలో జరగవలసిన పనులు నెరవేరుట, చేయు పనులు, వ్యాపార వ్యవహారములలో లాభనష్టములు సమానముగా నుండుట, తండ్రిగారికి అనారోగ్యం.

8) ఆగష్ణు:

పేరు ప్రతిష్టలు కలుగుతాయి, కార్యదక్షత పెరుగుతుంది, సౌభాగ్యముసిద్ధించు సమయం, వివాహాది శుభకార్యములు నెరవేరుట, బంధు మిత్రులు కలియుట, విందు వినోదములలో పాల్గొనుట, వృత్తి - ఉద్యోగ - వ్యాపారములలో సంతృప్తికరమైన ఫలితములను పొందుట, ధనాదాయం, బ్యాంకుల ద్వారా ఋణసహాయం పొందుట, సకాలములో పనులు పూర్తి చేయుట వలన లాభములను పొందగలుగుట, ఫ్రీమూలక సహాయం, నూతనోత్సాహము, దీర్ఘరోగములతో బాధపడువారికి ఆరోగ్యము చేకూరును.

9) సెప్టెంబరు:

మనసులో ఆనందము పొందుతారు, అన్నివిధాలా అభివృద్ధి పొందుతారు, సర్వ సుఖములు కలుగుతాయి, శ్రమకు తగిన ఫలితము, ప్రభుత్వము వారిచే ప్రశంసలు పొందుట, సంఘములో గౌరవము, పలుకుబడి, ఉన్నత-పదవులను పొందుట, నూతన వ్యక్తులతో స్నేహ లాభములు, కుటుంబ సౌఖ్యము, బాకీలు వసూలగుట, వ్యాపార వ్యవహారములందు కలిసివచ్చుట, ధనలాభం, ఆర్థికంగా అభివృద్ధి, సుఖసంతోషములు చేకూరును.

10) అక్టోబరు:

శత్రువులు తగ్గుతారు, అధికారం పెరుగుతుంది, ప్రమోషన్లు పొందటానికి అవకాశం వుంది, ధర్మకార్యములు చేస్తారు, మాటకు గౌరవము వస్తుంది. కుటుంబ కలతలు, శిరస్సుకు సంబంధించిన బాధలు, స్నేహ విరోధములు, చలనములు, అనవసర ధనవ్యయం, జాయింటు వ్యాపారస్తులతో మనస్పర్ధలు, కలహములు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులపై చర్యలు తీసుకొనుట, కఠిన శిక్షలు అమలు జరుపుట, జంతువులు, పశువుల వలన క్రయవిక్రయ లాభం, సంబంధమైన విషయముల యందు ఆసక్తి, క్రొత్త విషయములను తెలుసుకొనుట జరుగును. వాహన ప్రమాదములు, ఎత్తు నుండి జారిపడుట.

11) నవంబరు:

వ్యతిరేఖ ఫలప్రదము పొందుతారు. ధన నష్టము కలుగుతుంది, బంధువులతో విరోధము ఏర్పడుతుంది, ఇంట్లో కల్లోలములు ఇబ్బందులు కలుగుతాయి, శత్రువులు పెరుగుతారు, చేసే పనులలో ఆతురత పెరుగుతుంది, నూతన వ్యక్తులు, గొప్పవారితో పరిచయములు, స్నేహలాభం, తలంచిన కార్యములు నెరవేరుట, సంతాన కుటుంబవృద్ధి, దాంపత్య సౌఖ్యం, వ్యాపారస్తులకు క్రయవిక్రయముల రీత్యా ధనలాభం, పదిమందిలో పలుకుబడి, గౌరవ మర్యాదలు పొందుట, వ్యవసాయదారులకు లాభించుట, దేవాలయములను సందర్శించుట, దైవ కార్యములలో పాల్గొనుట.

12) డిశంబరు:

చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి, బుద్ధి భ్రంశము కలుగుతుంది, ఇతరులతో విరోధములు ఏర్పడతాయి, దూర ప్రయాణములుచేస్తారు, అవమానం పొందుతారు, అధికారుల కోపం పొందుతారు, అదృష్టం తగ్గుతుంది, ఉద్యోగం చేసేచోట గొడవలు తలెత్తుతాయి. అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రు, బంధువులతో సఖ్యత లేకపోవుట, ధన విషయములో యిబ్బందులు పడుట, ధన నష్టము, మనస్సునకు స్థిమితము లేకపోవుట, ఏ పనీ స్వయంగా చేయలేకపోవుట, ఇతరులమీద ఆధారపడుట, అధికారుల మెప్పను పొందలేకపోవుట, భార్యాపిల్లల వలన సుఖ శాంతులు లేకపోవుట.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+