వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వృశ్చిక రాశి ఫలాలు 2017 సంవత్సరానికి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం

విశాఖ 4వ పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ట 4 పాదాలు, మీ పేరులో మొదటి అక్షరము తో, నా, నీ, నూ, నే, నో, యా, యిూ, యు అను అక్షరములలో ఒకటి అయినచో మీది వృశ్చికరాశి.

By Ankam Maruthi
|
Google Oneindia TeluguNews

విశాఖ 4వ పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ట 4 పాదాలు, మీ పేరులో మొదటి అక్షరము తో, నా, నీ, నూ, నే, నో, యా, యిూ, యు అను అక్షరములలో ఒకటి అయినచో మీది వృశ్చికరాశి.

ధనుస్సు రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి

Scorpio Horoscope

1) 2017 జనవరి:

తీవ్ర వ్యతిరేక ఫలదములు పొందుతారు. అనారోగ్యం కలుగుతుంది, వివాదములు ఏర్పడుతాయి, అనుకున్న పనులు నెరవేరుట, బంధు మిత్ర సమాగమము, అన్నదమ్ములు, అప్పచెల్లెండ్రతో సఖ్యతగా వుండుట, ఋణ బాధలు తీరుట, సరుకులు కొనుట, అమ్మట వలన లాభం, ధనాదాయము చేకూరుట, సంఘములో గౌరవము, పలుకుబడి, ఉద్యోగాభివృద్ధి, భార్యాభర్తలు అన్యోన్యముగా వుండుట, కుటుంబ సౌఖ్యము.

2) ఫిబ్రవరి:

ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడతాయి, ఎక్కువ శ్రమ చేయవలసి వస్తుంది, దారిద్య్రత కలుగుతుంది, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, ధనము నిలకడగా వుండుట, లాభ-నష్టములు సమానము, మిత్రుల వలన అనుకున్నపనులు కార్యానుకూలమగుట, క్యాంపస్ పరీక్షలలో పాసయి సెలెక్టు అగుట, పెద్దలు- పలుకుబడి గల వ్యక్తుల ద్వారా ఉపకారములు, సన్మానములు, దైవ కార్యములలో పాల్గొనుట, చలనములు.

3) మార్చి:

ఖర్చు పెరుగుతుంది, బంధుజనులతో విరోధము ఏర్పడుతుంది, ఉన్నచోటు మార్పు జరుగుతుంది, నూతన వ్యాపార ప్రయత్నములు అనుకూలించుట, క్రయవిక్రయ లాభం, ధనాదాయం, కుటుంబ సమస్యలు పరిష్కారమగుట, ఆనందోత్సాహములు వెల్లివిరియుట, ఉద్యోగములో స్థిరత్వము చేకూరుట, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి వుండుట, సంతాన సౌఖ్యం, కీర్తి ప్రతిష్టలు సంపాదించుట, చర్మ సంబంధ వ్యాధులు, అనారోగ్యం.

4) ఏప్రియల్:

చేసే పనులకు హాని జరుగుతుంది, అధికారం, గౌరవం తగ్గుతుంది, వ్యాపారంలో నష్టము ఏర్పడుతుంది, మనస్సు నిలకడగా వుండకపోవుట, బంధుమిత్రుల వలన ధనవ్యయం, పిత్రార్జితము, స్థిరాస్థి విషయంలో తగాదాలు, కుట్రలు, సంఘములో గౌరవము, పలుకుబడి, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, క్రయవిక్రయ లాభం, ఏజెన్సీలు తీసుకొనుట, ధనాదాయం, కుటుంబ, అనారోగ్యం.

5) మే:

అన్ని పనుల్లో అవాంతరములు కలుగుతాయి, మిత్రులకు దూరమౌతారు, స్థితి నాశము. బంధువులలో ఆధిఖ్యత, పశువులను కొనుట వలన ఆదాయము సరిగారాక నష్టపోవుట, ధనవ్యయం, ధనము ఏదోరూపేణా చేతికి అందుచుండుట, స్త్రీల వలన ఉపకార లాభములు పొందుట, గౌరవ మర్యాదలు, సౌఖ్యం, చేయు కృషి వృద్ధిగా వుండుట, విద్యాగోష్టి పండితులను కలుసుకొనుట, ఆశీస్సులు పొందుట.

6)జూన్:

శుభఫలస్థానం ఫలితాలు వర్తిస్తాయి. ధన లాభము కలుగుతుంది, సంసారంలో సుఖము పొందుతారు, నమ్మిన వారి వలన మోసములు, దగాలు పొందుట, అధికారుల వలన భయం, ఆందోళన, భార్యాభర్తల మధ్య సఖ్యత సరిగా లేకపోవుట, కుటుంబ కలతలు, శతృవృద్ధి, చదువు మీద శ్రద్ధ లేకపోవుట, పెంపుడు జంతువుల వలన మనస్సుకు వ్యాపార వ్యవహారములలో ఆశించిన ఫలితములు పొందలేకపోవుట, కడుపునొప్పి, కంటి రోగములు, అనారోగ్యం, పీడకలలు, భయం, దెబ్బలు తగులుట, ఎముకలు విరుగుట.

7) జూలై:

పేరు ప్రతిష్టలు కలుగుతాయి, కార్యదక్షత పెరుగుతుంది, సౌభాగ్యముసిద్ధించు సమయం, మనసులో ఆనందము పొందుతారు, ఫ్రీ మూలక కలహములు, తలంచిన కార్యములకు ఆటంకములు, ఎంత మంచిగా వ్యవహరించు కుందామనుకున్నా చెడు ఎదురవుచుండుట, అధికారులతో విరోధములు, తక్కువ వారి వలన మాటలు పడుట, ప్రయాణములకు ఆటంకములు, అశుభవార్తలు వినుట, వ్యాపార లావాదేవీలు సరిచూచుకొనుట మంచిది.

8) ఆగష్టు:

అన్నివిధాలా అభివృద్ధి పొందుతారు, సర్వ సుఖములు కలుగుతాయి, శత్రువులు తగ్గుతారు, పాత బాకీలు వసూలగుట, వ్యవహారములు మధ్యవర్తుల ద్వారా పరిష్కారమునకు వచ్చుట, వృత్తి వ్యాపారములు కలిసివచ్చుట, ధనలాభం, కుటుంబ సౌఖ్యం, గృహనిర్మాణాది కార్యక్రమములు నెరవేరుట, శుభములు చేకూరుట, అధికారుల వలన ఉపకార లాభములు పొందుట, శుభప్రశంసలు, తలంపులు జరుగును.

9) సెప్టెంబరు:

అధికారం పెరుగుతుంది, ప్రమోషన్లు పొందటానికి అవకాశం వుంది, ధర్మకార్యములు చేస్తారు, మాటకు గౌరవము వస్తుంది. అధికారుల వలన చికాకులు, ఉద్యోగస్తులకు స్థాన మార్పులు, అకారణ కలహములు, రక్షణ శాఖ, న్యాయస్థానములను ఆశ్రయించుట, భూ- గృహ - వ్యవసాయ ఋణములకు ప్రయత్నములు చేయుట, సాధించుట, సంగీత సాహిత్యాది కళలయందు ఆసక్తి, శతృవులు మిత్రులగుట, కుటుంబ సౌఖ్యం, నిలిచిపోయిన పనులు పూర్తి చేయుట.

10) అక్టోబరు:

ఏలినాటి శనిలో ఇది రెండవ రాశి చలన కాలము. జన్మరాశిలో శనిగ్రహ చలనం తీవ్రదోష ఫలితాలనిస్తుంది. శరీరంలో తేజస్సు తగ్గటం, భయం, బంధు మిత్ర సమాగమము, జాయింటుదార్లతో మనస్పర్ధలు, కలహములు, నూతన వ్యక్తులతో స్నేహ లాభములు, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, కుటుంబ సౌఖ్యము, వృత్తి వ్యాపారములలో ముందుకు వెళ్ళట, ధనలాభం, ఆకస్మిక ప్రయాణములు, అధికారానుగ్రహం, పెండింగు పనులు, వ్యవహారములు ఆలస్యము విూద నెరవేరుట, పుణ్యక్షేత్ర సందర్శనములు చేయుట జరుగును.

11) నవంబరు :

రోగాలు కలుగుతాయి, దుఃఖము పొందుతారు, బంధువులకు దూరమౌతారు, బంధువులతో శత్రుత్వము ఏర్పడతాయి, అనవసర ధనవ్యయం, బంధు వర్గము వారితో విరోధములు, తలంచిన కార్యములకు ఆటంకములు, వెంటనే నెరవేరకపోవుట, అనవసర కలహములు, చేయు వృత్తి వ్యాపారములు ప్రోత్సాహకరముగా లేకపోవుట, ఊహించిన లాభములు సరిగా రాకపోవుట, ఉద్యోగస్తుల స్థానచలనములు, దుష్టసహవాసములు, చెడు వ్యసనములకు లోనగుట, తరచు ప్రయాణములు, ఆరోగ్యము సామాన్యముగా వుండును.

12) డిశంబరు:

శ్రమకరమైన ప్రయాణాలు చేస్తారు, చేసే పనులలో అవరోధాలు ఏర్పడతాయి, తప్పుడు పనులు చేస్తారు, బుద్ధి చపలంగా మారుతుంది, రోగము వలన బాధ కలుగుతుంది, హృదయము నందు వ్యాధి వంటి వ్యతిరేక ఫలములు కలుగును. సంఘములో గౌరవము, పలుకుబడి, తలపెట్టిన కార్యములు విజయ వంతముగా నెరవేరుట, వ్యవసాయములో ఫలించుట, వ్యాపారస్తులకు క్రయవిక్రయ లాభం, ధనలాభం, కుటుం సౌఖ్యం, గృహములో వివాహాది శుభకార్యములు నెరవేరుట, స్నేహితుల వలన ఉపకార లాభములు పొందుట, నూతన వస్తు వస్తాభరణప్రాప్తి, ఆనందోత్సాహములతో ఇల్లు కళకళలాడుచుండును. దైవకార్యములలో పాల్గొనుట, పూజలు చేయుట, ఇతరులకు సహాయము చేయుట. వృశ్చిక రాశివారు ఏలినాటి శనిదోష పరిహారమునకు శనికి 19 వేలు జపం, నువ్వులు దానం, శని త్రయోదశికి శనికి తైలాభిషేకం నువ్వులు. దానం చేయించాలి.

English summary
Read year horoscope, astrology and predictions of 2017 in Telugu. Get the complete year prediction for 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X