వాస్తు ప్రకారం మెయిన్ ఎంట్రన్స్ దక్షిణం, ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం ఉంటే ఏం చేయాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం, స్థలం మెయిన్ ఎంట్రన్స్ ఒక దిశలో ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం మరో దిశలో ఉండటం సహజంగా జరుగుతుంటుంది. మెయిన్ ఎంట్రన్స్ దక్షిణం వైపు ఉండి, ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉంటే ఎటువంటి వాస్తు నియమాలు పాటించాలి? వాస్తు నిపుణులు చెబుతున్న సూచనలు, సలహాలు ఏమిటి? అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
దక్షిణం దిశలో ముఖ ద్వారం ఉన్నప్పుడు
ఆగ్నేయం వైపు ద్వారం ఉండటం అత్యంత శుభప్రదం.
నైరుతి దిశలో ఉండకూడదు.
ఇలా ఉంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అశాంతికి దారితీస్తుంది.

ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరంలో ఉన్నప్పుడు అది చాలా మంచిది.
దీన్ని కుబేర స్థానం అంటారు.
ప్రధాన ద్వారం ఉత్తర గోడపై ఈశాన్యం వైపుకు ఉండాలి.
ఇలా ఉంటే సంపద, అభివృద్ధి కలుగుతాయి.
దక్షిణం వైపు ఉన్న గేటుకు, ఉత్తరం వైపు ఉన్న ప్రధాన ద్వారానికి మధ్య నేరుగా మార్గం ఉండకూడదు.
గేటు గుండా లోపలికి రాగానే ఎదురుగా ప్రధాన ద్వారం కనిపించకూడదు.
కొంత ఖాళీ స్థలం ఉండాలి. అది ఇంటిని చుట్టి వెళ్లేలా ఉండాలి.
దక్షిణం, పడమర వైపు ఉన్న కాంపౌండ్ గోడలు,
ఉత్తరం, తూర్పు గోడల కంటే ఎత్తుగా, మందంగా ఉండాలి.
వాస్తు ప్రకారం దక్షిణ దిశ ప్లాట్లలో ఇంటికి ముందు కంటే,
వెనుక వైపు ఎక్కువ ఖాళీ స్థలం వదలాలి.
దక్షిణం గేటు నుండి ఉత్తరం ద్వారం వైపు వెళ్ళేటప్పుడు ప్రదక్షిణ చేసేలా మెట్లు ఉండాలి.
దక్షిణ గేటుకు ఎరుపు, ముదురు బ్రౌన్ లేదా ఎర్త్ కలర్స్ వాడాలి.
దీనివల్ల సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.
నలుపు, ముదురు నీలం రంగులు అసలు వాడకూడదు.
గేటు పైన లేదా పక్కన స్వస్తిక్, ఓం ఉండాలి.
లేదంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఉంచాలి.
దీనివల్ల ఆ దిశకు సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications