నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో వన్.. నేనొక్కడినే మూవీలో మహేష్ బాబు చైల్డ్ వుడ్ క్యారెక్టర్ ను పోషించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. కెరీర్ పై దృష్టి పెట్టాడు. ఇప్పుడు తాజాగా మరోసారి నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్. గౌతమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 14డేస్ అనే షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో గౌతమ్ హావభావాలు అచ్చం మహేష్ బాబులాగే ఉండటంతో ఘట్టమనేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
సూపర్ స్టార్ కృష్ణకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఆయన తర్వాత తండ్రికి తగిన తనయుడిగా మహేష్ బాబు ఇప్పటివరకూ అటు ఫ్యాన్స్ తోపాటు సగటు సినీ ప్రేక్షకుడ్ని అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళితో వారణాసి అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇటీవల జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్. ఇటీవల హైదరాబాద్ వచ్చింది. ఇక్కడే భారీ సెట్లో షూటింగ్ చేసుకోనుంది. రాజమౌళి- మహేష్ బాబు కాంబో తొలిసారి వస్తున్న క్రమంలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈలోపే ఘట్టమనేని ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసేందుకు మహేష్ కుమారుడు గౌతమ్ యాక్టింగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా 14 డేస్ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించాడు. మూడు నిమిషాల 20 సెకండ్స్ నిడివి ఉన్న షార్ట్ ఫిలిం లో గౌతమ్ కనిపించాడు. ఈ షార్ట్ ఫిలిం కి గౌతమ్ స్నేహితుడు అలెక్స్ లక్ష్మి దర్శకత్వం వహించాడు. ఈ షార్ట్ ఫిలిం లో గౌతమ్ నటన చాలా ఇంటెన్స్ గా ఉంది. ఓ క్రైమ్ కు సంబంధించిన నేరస్థుడ్ని అన్వేషించే యువకుడిగా గౌతమ్ తన నటనతో మెప్పించాడు. కళ్లలో ఆ ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే మహేష్ ను మించిన యాక్టింగ్ అని తెలుస్తోంది.

ఈ షార్ట్ ఫిల్మ్ లో అనూషే ధనేని హీరోయిన్ గా మెప్పించింది. కిడ్నాప్ అయిన తన లవర్ కోసం వెతుకుతూ హీరో పడే తపన గౌతమ్ కళ్లకుకట్టినట్లు చూపించాడు. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ రన్ టైమ్ చాలా తక్కువగా ఉండటంతో ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నారు. ఇక ప్రస్తుతం గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఉండే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications