T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..!
టీ20 వరల్డ్ కప్ (t20 world cup)ను మరోసారి టీమిండియా ఎగరేసుకుపోయింది. స్వదేశంలో జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో గట్టి పోటీ ఇస్తుందని భావించిన న్యూజీలాండ్ పై భారీ తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో హోరాహోరీగా సాగాల్సిన ఫైనల్ కాస్తా ఏకపక్షంగా తేలిపోయింది. అయినా టోర్నీలో ఫైనల్ వరకూ వచ్చిన న్యూజీలాండ్ ప్రదర్శనను కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఐసీసీ (icc) నిన్న మ్యాచ్ ముగిశాక అర్ధరాత్రి ట్వీట్ చేసింది.
నిన్న అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచినా భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన కివీస్ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. 20 ఓవర్లలో భారత్ రికార్డు స్దాయిలో 255 పరుగులు చేసి న్యూజీలాండ్ ముందు 256 పరుగుల భారీ విజయ లక్ష్యం ఉంచింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్.. ఏ దశలోనూ గెలుస్తుందన్న ఆశ కల్పించలేదు. చివరికి 19 ఓవర్లలో 159 పరుగులకే చాప చుట్టేసింది. దీనిపై ఐసీసీ అర్ధరాత్రి ట్వీట్ చేసింది.

Despite the Final defeat, a #T20WorldCup campaign to be proud of for Mitchell Santner and his New Zealand side 👏 🇳🇿 pic.twitter.com/oSRyAIStTT
— ICC (@ICC) March 8, 2026
ఫైనల్ ఓడినప్పటికీ మిచెల్ సాంట్నర్, అతని న్యూజిలాండ్ జట్టు టీ20 వరల్డ్ కప్ లో గర్వించదగ్గ ప్రదర్శన చేసిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు నిన్న మైదానంలో భారత్ చేతిలో ఓటమి తర్వాత డీలా పడ్డ న్యూజీలాండ్ క్రికెటర్ల ఫొటోలను కూడా కలిపి షేర్ చేసింది. నిన్న భారత్ చేతిలో ఓటమి తర్వాత కివీస్ బౌలర్ సోధీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మిగతా క్రికెటర్లు కూడా పూర్తిగా నీరసంగా కనిపించారు. దీంతో వారిని ఊరడిస్తూ సోషల్ మీడియాలో అక్కడక్కడా పోస్టులు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications