ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి, మన సంప్రదాయం ప్రకారం పంచె ధరించాలి. దేవాలయాలను సందర్శించుకొని షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తీసుకోవాలి.
ఇందులో 6 రకాల రుచులు కలిసి ఉంటాయి. తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు తీసుకోవడంవల్ల కొత్త సంవత్సరంలో, మన జీవిత పయనంలో ఎదురయ్యే అనేకరకాల సవాళ్లను అధిగమించడం, ఎదుర్కునే అనుభవాలన్నీ కొన్ని తియ్యగా, కొన్ని చేదుగా, కొన్ని వగరుగా.. ఇలా ఉంటాయని, అన్నింటినీ సమపాళ్లలో స్వీకరించాలని పండితులు చెబుతారు. తర్వాత సాయంత్రం పండితులు చెప్పే పంచాంగ శ్రవణాన్ని వింటాం. ఆ ప్రకారం కొత్త సంవత్సరం ఏవిధంగా ఉండబోతోంది అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తాం. మనకు తెలుగులో 12 రాశులుంటాయి. వీటిని ద్వాదశ రాశులు అంటారు. ఉగాది అనగానే కొత్త సంవత్సరంలో తమకు చాలా బాగుంటుందనే ఆశతో ఎంతోమంది రాశులవారు ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం మీన రాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

వృశ్చిక రాశి - పరాభవ నామ సంవత్సర (19.03.2026 - 06.04.2027)
ఆదాయం: 11
వ్యయం: 13
రాజపూజ్యం: 5
అవమానం: 4
పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశివారికి మిశ్రమఫలాలను ఇచ్చే సంవత్సరం. ఆదాయ మార్గాలున్నప్పటికీ ఏవైనా అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఇల్లు, ఆరోగ్యం లేదా కుటుంబ అవసరాలకు ఎక్కువ ఖర్చు అవుతుంది. డబ్బులు పొదుపుగా వాడుకుంటూ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఉద్యోగ రంగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. బదిలీ, ఉద్యోగ మార్పు లేదా కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి మారాలి. మారేటప్పుడు వాస్తవిక దృక్కోణం అవసరం. వ్యాపారస్థులకు పాత వ్యాపారమే కలిసివస్తుంది. పెద్ద పెట్టుబడులు పెట్టాలంటే ఈ సంవత్సరం కొంత జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబంలో సహకార అందుతుంది. చిన్న చిన్న మనస్తాపాలు ఉంటే ప్రశాంతంగా పరిష్కరించుకుంటారు. దాంపత్య జీవితంలో పరస్పర విశ్వాసం పెంచుకోవడం అవసరం. పిల్లల ఎలా చదువుతున్నారో గమనించాలి. స్నేహితులు లేదా బంధువుల సహాయంతో మీ ప్రధానమైన సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
ఆరోగ్యం పరంగా బలహీనత ఉంటుంది. చర్మం, మూత్రపిండాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. డాక్టర్లకు చూపించుకోవడంతోపాటు యోగ, ధ్యానం చేయాలి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, ఉపవాసం చేయడం, మంగళవారం, శనివారం దేవుడిని పూజించడంవల్ల మనశ్శాంతిగా ఉంటారు. సహనం ఉండాలి. ఆత్మస్థైర్యంతో పనులు కొనసాగితే మంచి ఫలితాలు వస్తాయి.
============================
తులా రాశి - పరాభవ నామ సంవత్సర (19.03.2026 - 06.04.2027)
ఆదాయం: 13
వ్యయ: 12
రాజపూజ్యం: 7
అవమానం: 3
పరాభవ నామ సంవత్సరం తులా రాశివారికి సమతుల్యంగా ఉంటుంది. ఆదాయంలో పెరుగుదలతోపాటు, కొత్త వ్యవహారాలు, భాగస్వామితో కలిసి వ్యాపారం లేదా అదనంగా పనులు చేసుకోవడంతో ఆర్థికంగా బలపడతారు. ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో రంగులు, ఇతర మరమ్మతులు, వాహనం కొనుగోలు, శుభకార్యాలుండటంవల్ల ఖర్చు ఉంటుంది.
ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మీ నిర్ణయాలు, పనితీరు, సామర్థ్యం వల్ల ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతి లేదా బదిలీ ఉంది. వ్యాపారస్థులకు కొత్త వినియోగదారులు దొరకడంతోపాటు, వ్యాపార విస్తరణ, మంచి లాభాల సూచన ఈ ఏడాదిలో ఉంది. ఒప్పందాలు చేసుకొనేటప్పుడు అప్రమత్తంగా ఉండటం అవసరం. కుటుంబ జీవితంలో సంతోషకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దాంపత్యంలో సర్దుకుపోవాలి. అవివాహితులకు వివాహ యోగం ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
ఆరోగ్యం మంచిగా ఉండదు. కిడ్ని, షుగరు సమస్యలు పెరగకుండా శ్రద్ధ వహించాలి. వ్యాయామంతోపాటు యోగా చేయాలి. ఆధ్యాత్మిక యాత్రలు, కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. శనివారం శనిదేవుడిని పూజించండి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈ ఏడాది ఈ రాశివారికి గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా వృద్ధి నమోదవుతుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.
-
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..!












Click it and Unblock the Notifications