పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్
దేశంలో నేడు బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. లాభాల స్వీకరణతో పాటు అమెరికా డాలర్ బలోపేతం కావడంతో పసిడి, వెండి రేట్లు పడిపోయాయి. అదే సమయంలో అంతర్జాతీయ పరిణామాలు కూడా వీటి రేట్లపై ప్రభావం చూపాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధర 0.73 శాతం మేర తగ్గింది. 10 గ్రాములకు రూ. 1,60,450కి చేరుకుంది. కిందటి ట్రేడింగ్ సెషన్ తో పోల్చుకుంటే ఇందులో 3,000 రూపాయల వరకు తగ్గుదల కనిపించింది.
అలాగే వెండి ధర కూడా పడిపోయింది. 1.11 శాతం మేర క్షీణించి కిలోకు రూ. 2,65,301 వద్ద ట్రేడ్ అయింది. ఈ క్షీణత అంతర్జాతీయంగా డాలర్ బలోపేతానికి నిదర్శనం. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,63,630గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,49,990కి లభించింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,63,790 కాగా, 22 క్యారెట్లు రూ. 1,50,140గా ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్, పుణె, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లోనూ దాదాపు ఇదే ట్రెండ్ కనిపించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర సుమారు రెండు శాతం మేర పడిపోయింది. అమెరికా డాలర్ బలోపేతం కావడంతో డాలర్ ఆధారిత విలువైన లోహంపై ఒత్తిడి పెరిగింది. అమెరికా స్పాట్ గోల్డ్ 1.7 శాతం తగ్గి ఔన్స్‌కు 5,082.51 డాలర్లకు చేరింది. గోల్డ్ ఫ్యూచర్స్ 1.4 శాతం తగ్గి 5,099.40 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డాలర్ మూడు నెలల గరిష్ట స్థాయికి పెరగడంతో ఇతర కరెన్సీలను కలిగి ఉన్నవారికి బంగారం మరింత ఖరీదైనదిగా మారింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,309, 22 క్యారెట్లు - రూ. 14,950, 18 క్యారెట్లు - రూ. 13,000
ముంబై..
24 క్యారెట్లు - రూ. 16,168, 22 క్యారెట్లు- రూ. 14,820, 18 క్యారెట్లు - రూ. 12,126
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 16,168, 22 క్యారెట్లు- రూ. 14,820, 18 క్యారెట్లు - రూ. 12,126
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 16,168, 22 క్యారెట్లు- రూ. 14,820, 18 క్యారెట్లు - రూ. 12,126
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 16,168, 22 క్యారెట్లు- రూ. 14,820, 18 క్యారెట్లు - రూ. 12,126
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 16,168, 22 క్యారెట్లు- రూ. 14,820, 18 క్యారెట్లు - రూ. 12,126

Click it and Unblock the Notifications