Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం

తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి, మన సంప్రదాయం ప్రకారం పంచె ధరించాలి. దేవాలయాలను సందర్శించుకొని షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తీసుకోవాలి.

ఇందులో 6 రకాల రుచులు కలిసి ఉంటాయి. తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు తీసుకోవడంవల్ల కొత్త సంవత్సరంలో, మన జీవిత పయనంలో ఎదురయ్యే అనేకరకాల సవాళ్లను అధిగమించడం, ఎదుర్కునే అనుభవాలన్నీ కొన్ని తియ్యగా, కొన్ని చేదుగా, కొన్ని వగరుగా.. ఇలా ఉంటాయని, అన్నింటినీ సమపాళ్లలో స్వీకరించాలని పండితులు చెబుతారు. తర్వాత సాయంత్రం పండితులు చెప్పే పంచాంగ శ్రవణాన్ని వింటాం. ఆ ప్రకారం కొత్త సంవత్సరం ఏవిధంగా ఉండబోతోంది అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తాం. మనకు తెలుగులో 12 రాశులుంటాయి. వీటిని ద్వాదశ రాశులు అంటారు. ఉగాది అనగానే కొత్త సంవత్సరంలో తమకు చాలా బాగుంటుందనే ఆశతో ఎంతోమంది రాశులవారు ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం మీన రాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

Ugadi Horoscope These Zodiac Signs virgo and leo Will Experience Wonderful Results Throughout the Year

కన్యా రాశి - పరాభవ నామ సంవత్సర (19.03.2026 - 06.04.2027)

ఆదాయం: 12
వ్యయ: 11
రాజపూజ్యం: 6
అవమానం: 3

పరాభవ నామ సంవత్సరం కన్యా రాశివారికి స్థిరత్వాన్ని, క్రమబద్ధతను, ఆలోచనలో పురోగతిని మెరుగుపరుస్తుంది. ఆదాయం సరిపోతుంది. గత కొన్ని సంవత్సరాలలో చేసిన కృషికి ఈ సంవత్సరం ఫలాలు అందుతాయి. కొత్త ఆదాయ మార్గాలు నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ క్రమేణా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చు నియంత్రణలో ఉంచుకోవాలి. కానీ కుటుంబ అవసరాలు లేదా విద్యాభ్యాసానికి సంబంధించిన ఖర్చులు ఉండవచ్చు.

ఉద్యోగ రంగంలో ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతి లేదా జీతం పెరుగుతుంది. కార్యాలయంలో ప్రముఖ ప్రాజెక్టుల బాధ్యత మీపై పడుతుంది. సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. వ్యాపారస్తులకు అంచనాలు పెరుగుతాయి. కొత్త టెక్నాలజీ వినియోగిస్తే మరింత లాభం. ఆస్తి కొనుగోలు, భూమి లేదా ఇంటి సంబంధిత వ్యవహారాల్లో లాభదాయకంగా ఉంది. కుటుంబ జీవితంలో శాంతి, సమతుల్యత ఉంటుంది. దాంపత్యంలో పరస్పర సహకారంతోపాటు పిల్లల పురోగతి వల్ల ఆనందిస్తారు. ఉద్యోగంలో, వ్యాపారంలో, అన్ని పనుల్లో ఉత్తమ పనితీరు కనపరుస్తారు. విదేశాల్లో విద్యాభ్యాసం కోసం చూస్తున్నవారి కోరిక నెరవేరుతుంది.

ఆరోగ్య పరంగా జీర్ణక్రియ, చర్మం లేదా నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. నియమిత వ్యాయామం, యోగ చేయడంతోపాటు సాత్విక ఆహారం అవసరం. మానసిక ఒత్తిడి తగ్గించడానికి ధ్యానం చేయాలి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. విష్ణు సహస్రనామ పారాయణ లేదా బుధవారం పూజ శుభఫలితాలు కలిగిస్తాయి. స్నేహితుల సహకారంతో ఒక ముఖ్యమైన ప్రణాళిక విజయవంతమవుతుంది. మొత్తంగా ఈ సంవత్సరం కన్యా రాశివారికి సమతుల్యం, ఆర్థిక స్థిరత్వం, సమాజంలో గౌరవాన్ని పెంచే సంవత్సరం.
============================

సింహ రాశి - పరాభవ నామ సంవత్సర (19.03.2026 - 06.04.2027)

ఆదాయం: 15
వ్యయ: 9
రాజపూజ్యం: 8
అవమానం: 2

పరాభవ నామ సంవత్సరం సింహ రాశివారికి అత్యంత శుభకరంగా ఉంటుంది. ఆదాయంలో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది. పాత పెట్టుబడులు మంచి లాభాన్ని పొందుతారు. అదనపు అవకాశాలవల్ల ఆర్థికంగా బలపడతారు. ఖర్చు నియంత్రణలో ఉండటం వలన డబ్బును పొదుపు చేసుకుంటారు. ఉద్యోగ రంగంలో పదోన్నతి, గౌరవం, అదనపు బాధ్యతలు లభిస్తాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, సహద్యోగుల నుంచి గౌరవం లభిస్తుంది. రాజపూజ్యం వల్ల సమాజంలో మంచి స్థానం కలుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, భారీ లాభదాయక అవకాశాలు లభిస్తాయి.

కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో దంపతుల మధ్య పరస్పర గౌరవం, ప్రేమ ఉంటాయి. ఉన్నత విద్యతోపాటు పోటీ పరీక్షలు రాసేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. నియమిత వ్యాయామం, సమతుల ఆహారం తీసుకోవాలి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం, సూర్యనారాయణ ఆరాధన లేదా దాన ధర్మాలు మరింత శుభఫలితాలు అందజేస్తాయి. మొత్తంగా ఈ సంవత్సరం సింహ రాశివారికి విజయం, గౌరవం, ఆర్థిక అభివృద్ధి , సమాజంపై ప్రభావం చూపించేంత శక్తిని కలిగిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+