ఉగాది నుండి వీరికి ధనయోగం.. బిజినెస్ అద్భుతం.. వృషభరాశి జాతకమిలా!
శ్రీ పరాభవ నామ ఉగాది సంవత్సరం మార్చి 19వ తేదీన ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరాది ప్రారంభం నుండి పంచాంగం ప్రకారం వివిధ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. ఇక అటువంటిది నేడు వృషభ రాశి వారి జాతకం ఏ విధంగా ఉంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కలిసి వస్తుందా లేదా అనేది తెలుసుకుందాం.
వృషభ రాశి వారి జాతకం
ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5 అవమానం 4గా ఉన్నాయి.ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అద్భుతమైన రాజయోగం మరియు ఆర్థిక లాభాలు ఉన్నాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా శుభకార్యాల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు.

ఆర్థిక స్థితి
వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఉగాది తర్వాత వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ధనలాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఈ సంవత్సరం వృషభ రాశి జాతకులకు సమాజంలో గౌరవ మర్యాదలు బాగుంటాయి. ఉన్నతాధికారుల నుండి సహకారం లభిస్తుంది. అయితే కొన్ని కొన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
వ్యక్తిగత జీవితం
వృషభ రాశి జాతకులు వ్యక్తిగత జీవితం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనవసరమైన నిందలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు, అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి జాతకులు మొండి పట్టుదల వీడడం ఎంతో మంచిది.
కెరీర్ మరియు వ్యాపారం
భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం వర్తక వ్యాపారాలు చేసే వారికి ముఖ్యంగా హోల్సేల్, రిటైల్ వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి సమయం బాగుంది. అయితే జాయింట్ వెంచర్లు పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త.
ఆరోగ్యం
వృషభ రాశి జాతకులకు 2026 27 సంవత్సరం శారీరక, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. కనుక ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వృషభ రాశి జాతకులు మరింత మెరుగైన ఫలితాల కోసం కొన్ని పరిహారాలను చేస్తే మంచిది. విష్ణుమూర్తి ఆరాధన శనివారం మరియు బుధవారం చేస్తే వీరికి మంచి ఫలితాలు వస్తాయి.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.
-
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!! -
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications