తెలుగు నిర్మాతలను అపర కుబేరులుగా మార్చిన 4 డబ్బింగ్ సినిమాలు
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దేశంలో ఏ పరిశ్రమకు లేనంత ప్రత్యేకత ఒకటి ఉంది. అదేమిటంటే.. కంటెంట్ బాగుంటే ఇతర భాషల నుంచి అనువాదమయ్యే డబ్బింగ్ సినిమాలను కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బ్రహ్మరథం పడతారు. అప్పుడప్పుడు కొన్ని డబ్బింగ్ సినిమాలు వాణిజ్య వర్గాల అంచనాలను సైతం తలకిందులు చేస్తూ, బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసి, ఆ సినిమాను కొన్న నిర్మాతలను అపర కుబేరులుగా మార్చాయి. వారికి ఊహకందని లాభాలను తెచ్చిపెట్టాయి.
ఈ క్రమంలో ఒక నాలుగు డబ్బింగ్ సినిమాలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రెండేళ్ల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీ తెలుగులో 12 కోట్లకు అమ్ముడుపోయింది. సినిమా విడుదలైన తర్వాత నిర్మాతకు జేబులో 35 మిగిలాయి. రజనీకాంత్ మేనియాకు తోడు అనిరుధ్ మ్యూజిక్ తోడవడంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఆదరించారు.

శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన 'అమరన్' చిత్రం కూడా డబ్బులు తెచ్చిపెట్టింది. ఆర్మీ అధికారి నిజ జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా, సాధారణ అంచనాలతో కేవలం 5 కోట్ల రూపాయలకు తెలుగులో అమ్ముడుపోయింది. కానీ, థియేటర్లలో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. నిర్మాతకు 30 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టి అతన్ని ఆనందంలో ముంచెత్తింది.
జైలర్ సినిమా రూ.36 కోట్లు తెచ్చిపెట్టింది.
కాంతార సినిమా రూ.30 కోట్లు తెచ్చిపెట్టింది.
అమరన్ సినిమా రూ.30 కోట్లు తెచ్చిపెట్టింది.
బిచ్చగాడు సినిమా రూ. 17 కోట్లు తెచ్చిపెట్టింది.
ఇందులో బిచ్చగాడు సినిమా అయితే కేవలం రూ.50 లక్షలకే కొన్నారు. కాంతార సినిమాను అల్లు అరవింద్ రూ.2 కోట్లకు కొన్నారు. దీన్ని బట్టి లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications