today rashiphalalu: నేడు బృహస్పతి, బుధుల స్థానాలలో మార్పు.. వీరికి జాక్ పాట్!
మార్చి 10 2026 ఈ రోజు గ్రహాల స్థితి ప్రకారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా నవంబర్ 9వ తేదీ 2025 నుంచి వక్రగతి లో ఉన్న బృహస్పతి నేడు రాత్రి సుమారు 11:30 నిమిషాలకు కర్కాటక రాశిలో సరళ గతిలోకి వస్తాడు.
ముఖ్య గ్రహాల సంచారంతో ద్వాదశ రాశులవారి జాతకాలు
బుధుడు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల 32 నిమిషాలకు శతభిషా నక్షత్రం లోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు ముఖ్యమైన గ్రహాల మార్పులు ద్వాదశ రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. నేటి ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషం
మేష రాశి జాతకులకు నేడు పనుల్లో పురోగతి ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
వృషభం
వృషభ రాశి జాతకులు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది. నేడు వీరికి పనుల్లో కొంత ఒత్తిడి ఉండొచ్చు.
మిథునం
మిధున రాశి జాతకులకు ఉద్యోగంలో గుర్తింపు లభించే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. నేడు వీరికి ప్రయాణ యోగం ఉంది.
కర్కాటకం
కర్కాటక రాశి జాతకుల కుటుంబ విషయాల్లో ఆనందం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
సింహం
సింహరాశి జాతకులకు నేడు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ధనలాభం వచ్చే అవకాశం ఉంది.
కన్యా
కన్యారాశి జాతకులకు పనుల్లో కొంత ఆలస్యం ఎదురు కావచ్చు. సహోద్యోగుల సహకారం అవసరం గా మారుతుంది. ముఖ్యంగా నేడు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
తుల
తులా రాశి జాతకులకు వ్యాపారంలో మంచి లాభాలు ఉండొచ్చు. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొత్త ప్రణాళికలు విజయవంతం అవుతాయి.
వృశ్చికం
వృశ్చిక రాశి జాతకులు నేడు పనిలో ఒత్తిడి ఎదుర్కొంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవడం మంచిది. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.
ధనుస్సు
ధనుస్సు రాశి జాతకులకు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. స్నేహితుల సహాయం లభిస్తుంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
మకరం
మకర రాశి జాతకులకు నేడు ఆర్థికంగా కొంత జాగ్రత్త అవసరం. కుటుంబ విషయాల్లో శాంతంగా వ్యవహరించాలి. పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు.
కుంభం
కుంభరాశి జాతకులకు నేడు కొత్త అవకాశాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యం బాగుంటుంది.
మీనం
మీనరాశి జాతకులు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. పనుల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.
-
today rashiphalalu: మహాలక్ష్మీ యోగంతో ఆకస్మిక ధనలాభం -
జన్మ నక్షత్రం పుబ్బ, ఉత్తర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్ ఎక్కడ ఉండాలి? -
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!











Click it and Unblock the Notifications