వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుపరిపాలన దినోత్సవం నాడు వారణాసిలో ప్రధాని మోడీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురవారం సుపరిపాలన దినోత్సవం సందర్భంగా తన నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్నారు. మోడీ ప్రభుత్వం మాజీ ప్రధాని వాజ్‌పేయి పుట్టినరోజైన డిసెంబర్ 25న జాతీయ సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

గురువారం ప్రధాని మోడీ వారణాసిలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. గత నెలలో వారణాసిలో అస్సీ ఘాట్‌లో ప్రధాని ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌లో భాగంగా చేపడుతున్న పారిశుధ్ద్య కార్యక్రమాలను ఆయన పరిశీలించనున్నారు.

Modi to visit Varanasi tomorrow for 'Good Governance Day'

నవంబర్ 8న వారణాసికి వచ్చిన ప్రధాని మోడీ శనివారం ఉదయం ఆయన అస్సీ ఘాట్ లో గంగా పూజలో పాల్గొన్నారు. గంగమ్మకు పూజలు నిర్వహించారు. స్వయంగా పార చేతబట్టి... మట్టిని ఎత్తి పోశారు. అనంతరం ఆయన అస్సీ ఘాట్ లో 'నిర్మల్ గంగ' కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ ప్రక్షాళనకు నడుం బిగించారు.

ఈ కార్యక్రమంలోనే ప్రధాని మోడీ ఉత్తర ప్రదేశ్ కు చెందిన 9మందిని స్వచ్ఛ్ భారత్ లో పాల్గొనాలని ఆహ్వానించారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో పాటు క్రికెట్లర్లు సురేష్, రైనా, మహ్మద్ కైఫ్ , ప్రముఖ హాస్యనటుడు రాజీవ్ శ్రీవత్సవ్ తదితరులు స్వచ్ఛ్ భారత్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

అనంతరం మాట్లాడిన మోడీ గంగానది ప్రక్షాళణ మూడు నెలలలో పూర్తి అవుతుందని స్వచ్ఛంద సంస్థలు హామీ ఇచ్చాయన్నారు.

English summary
To mark the 'Good Governance Day' on Tuesday, Prime Minister Narendra Modi will be in his Lok Sabha constituency Varanasi where he will attend a number of programmes on the occasion of the birthday of former Prime Minister Atal Bihari Vajpayee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X