ఇక కరెంటు సంక్షోభం? వినియోగదారులకు కేంద్రం బిగ్ అలర్ట్..!
దేశవ్యాప్తంగా వేసవి, వడగాల్పుల (Heatwave)ప్రతాపం కొనసాగుతోంది. దేశంలోని ప్రతీ రాష్ట్రంలోనూ రికార్డు స్దాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం అల్లాడుతున్నారు. అదే సమయంలో వడగాల్పుల ప్రభావంతో రోడ్లపై ఉండాల్సిన జనం కాస్తా ఇళ్లకే పరిమితం అవుతున్న నేపథ్యంలో విద్యుత్ (Electricity)వినియోగం కూడా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రతీ రోజూ విద్యుత్ వినియోగం కొత్త రికార్డులు సృష్టిస్తున్న తరుణంలో కేంద్రం ఇవాళ వినియోగదారులకు హెచ్చరికల లాంటి సూచనలు చేసింది.
గత నాలుగు రోజులు చూసుకుంటే మే 18న దేశంలో 257.37 గిగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. మే 19న ఇది 260.45 గిగావాట్లకు చేరుకుంది. మే 20న 265.44 గిగావాట్లకు చేరింది. నిన్న మే 21న 270.82 గిగావాట్లకు చేరుకుని మరో రికార్డు నెలకొల్పింది. ఇవాళ ఇది ఎక్కడికి చేరుతుందో తెలియని పరిస్ధితి. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దేశవ్యాప్తంగా కరెంటు వినియోగం భారీగా ఉంటోందని కేంద్ర ఇంధన శాఖ వెల్లడించింది.

— Ministry of Power (@MinOfPower) May 22, 2026
వడగాల్పుల కారణంగా నాలుగు రోజులుగా విద్యుత్ వినియోగం పాత రికార్డులన్నీ తిరగరాసిందని ఇంధన శాఖ తెలిపింది. అయితే దేశంలో ఇంధన డిమాండ్ ను తట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో పాటు విద్యుత్ వినియోగదారులు కూడా విద్యుత్ ను జాగ్రత్తగా, తెలివిగా వాడుకోవాలని ఇవాళ కోరింది. దీన్ని బట్టి చూస్తుంటే మరింత విద్యుత్ వినియోగం పెరిగితే కష్టాలు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కాబట్టి ప్రజలు విద్యుత్ వినియోగం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్ధితి వచ్చేసింది.












Click it and Unblock the Notifications