బంజారాహిల్స్‌లో గోడకూలి 9మంది మృతి
హైదరాబాద్ః బంజారాహిల్స్ లోమంగళవారం వేకువజామున జరిగిన దుర్ఘటనలోఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. బంజారాహిల్స్ లోని భోలానగర్ లో ఒకఅపార్ట్ మెంట్ ప్రహరీ గోడకూలి ఆ పక్కనే వున్న ఇంటిపై పడింది. దీనితో ఆ ఇంట్లో నివసిస్తున్న 9 మంది మృతి చెందారు.అపార్ట్ మెంట్ ప్రహరీగోడను ఆదరాబాదరాగా నిర్మించడం వల్ల సోమవారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి గోడ కూలిపోయిందని భావిస్తున్నారు.అపార్ట మెంట్ పక్కనే నివాసం వున్న యూనిస్ హుస్సేన్ కుటుంబ సభ్యులు 9 మంది ఈ ప్రమాదంలో మరణించారు. పొద్దున్నే లేచి పనులపై బయటకు వచ్చిన అదే కుటుంబంలోని ముగ్గురు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ముగ్గురు పిల్లలతో పాటు ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిదిమంది మరణించిన సంఘటన రాష్ట్ర రాజధానినగరంలో సంచలనం సృష్టించింది.సరైన అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టి 9 మంది మృతికికారకుడైన అపార్ట్ మెంట్ యజమానిపై ప్రభుత్వం క్రిమినల్ చర్యకు ఉపక్రమించింది. సగం కూలిన ప్రహరీ గోడను పూర్తిగా కూల్చివేయడంతో పాటుఅపార్ట్ మెంట్ నాణ్యతను కూడా పరీక్షించాలని అధికారులు నిర్ణయించారు. పరారీలో వున్న అపార్ట్మెంట్ యజమాని అగర్వాల్‌ను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు..
ప్రమాదస్థలాన్ని సందర్శించిన ప్రముఖులుః
బంజారాహిల్స్ లో 9 మంది మరణించిన స్థలాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి దేవేందర్ గౌడ్, కృష్ణయాదవ్, ఎమ్మెల్ల్యేలుఅసదుద్దీన్ ఒవైసీ తదితరులు సందర్శించారు. మృతుల కుటుంబానికి ఆరులక్షల రూపాయలఎక్స్ గ్రేసియా ను దేవేందర్ గౌడ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా బాధిత కుటుంబానికి తగిన సహాయం చేయాలనిఎం.ఐ.ఎం. ఎమ్మెల్ల్యేలు డిమాండ్ చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!