వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటి కే హైదరాబాద్‌ యువత ఓటు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అమెరికాలో పరిస్థితి ఎలా వున్న ఇండియాలో మరీ ముఖ్యంగా మన సైబరాబాద్‌లో మాత్రం ఐటికి గిరాకీ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధుల తొలి ప్రాధాన్యత ఐటి రంగమే కావడం విశేషం.

అమెరికాలో ట్రెండ్‌ ఇక్కడ ధోరణులను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయిందని రిక్రూట్‌మెంట్‌ సంస్థలు అంటున్నాయి. అమెరికాలో ఐటి రంగం ఇచ్చిన షాక్‌తో కొత్త అభ్యర్ధులు స్థిరంగా వుండి నాలుగుకాలాల పాటు గ్యారంటీగా వ్యాపారం చేయగల సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఐటి కంపెనీలతో పోలిస్తే ఈ పరిశ్రమల్లో వేతనాలు తక్కువే అయినప్పటికీ వారు లెక్కచేయడం లేదు. పరుగెత్తి పాలు తాగడం కన్నా నిదానంగా నిలబడి నీళ్లు తాగడం ఉత్తమమనే ధోరణి కనిపిస్తున్నది.

కాలిఫోర్నియా సంస్థ వెట్‌ఫీట్‌ ఈ మధ్య 2000 మంది అభ్యర్ధులతో నిర్వహించిన సర్వేలో ఇంటర్నెట్‌-డాట్‌కామ్‌ రంగానికి కేవలం అయిదు శాతం మంది అభ్యర్దులు మాత్రమే పెద్దపీట వేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సర్వీసులు, ఫార్మా, బయోటెక్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ వంటి రంగాల్లో ఉద్యోగాలను కోరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

సైబరాబాద్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా వుంది. గత కొద్దినెలల కాలంలో ఐటి రంగంలో ఉద్యోగాలను ఆశిస్తున్న అభ్యర్ధుల సంఖ్య మూడునాలుగు రెట్లు పెరిగిందని రిక్రూట్‌మెంట్‌ సంస్థలు చెబుతున్నాయి. వీరిలో ఉద్యోగాలు కొల్పోయిన టెకీలతో పాటు ఇప్పుడిప్పుడే కాలేజీల్లోంచి వచ్చిన వారి సంఖ్యనే ఎక్కువగా వున్నదని అంటున్నారు. ముఖ్యంగా ఐటి ఆధారిత సర్వీసుల్లో చేరేవారి సంఖ్య ఎక్కువగా వుంది. ఐటి కంపెనీ అయితే చాలు క్లారికల్‌ ఉద్యోగమైనా ఫర్వాలేదనే వారి సంఖ్య గణనీయంగా వుంటున్నదని ప్లేస్‌మెంట్‌ సంస్థలు అంటున్నాయి.

ఐటి కంపెనీలకు సమాజంలో వున్న గౌరవం, ఈ సంస్థలు ఇస్తున్న వేతనాలు యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఆరునెలల క్రితం అనేక ఐటి సంస్థలు ఆఫర్‌ చేసిన వేతనాలతో పోలిస్తే ఇప్పుడు ఆఫర్‌ చేస్తున్న వేతనాలు చాలా తక్కువగగా వున్నప్పటికీ అభ్యర్ధులు లెక్కచేయడం లేదు. ఐటి సంస్థలు ఇప్పుడు ఆఫర్‌ చేస్తున్న వేతనాలు కూడా అనేక సంప్రదాయ పారిశ్రామిక సంస్థలు ఆఫర్‌ చేసే దాని కన్నా ఎక్కువని అభ్యర్ధులు అంటున్నారు. నందో రాజ భవిష్యతి.. చేసినన్ని రోజులు ఐటి ఉద్యోగం చేస్తే ఆ తర్వాత పరిస్థితి ఆలోచించుకోవచ్చనే ధోరణి యువకుల్లో కనిపిస్తున్నది. ఐటి సంస్థల్లో ఇప్పటికే పనిచేస్తున్నవారి జీవనశైలి వారిని ప్రలోభపెడుతున్నది. అన్నింటికీ మించి ఐటిలో వుంటే ఏదో ఒక రోజు అమెరికా విమానం ఎక్కవచ్చన్న విశ్వాసం కూడా వారిని మరోవైపు తలతిప్పనివ్వడంలేదు.

  • సిల్వర్‌లైన్‌,సెరినోవా ఆస్ట్రేలియా విలీనం
  • ఇండియా సెంటర్‌కు ఎరిబా స్వస్తి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X