ఇండియా సెంటర్‌కు ఎరిబాస్వస్తి
బెంగుళూరు: అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న బి2బి ఇ-కామర్స్ సొల్యూషన్స్ ప్రొవైడింగ్ సంస్థఎరిబా ఐఎన్సి. ఇండియాలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు స్వస్తి చెప్పింది.
ఆసియాలో తమ ప్రాజెక్టుల సపోర్టింగ్‌కు ఇండియానే తమకు కార్యక్షేత్రంగా ఉపయోగపడుతున్నదని మునుముందు కూడా తమ సంస్థ కార్యకలాపాల్లో భారత్ వ్యూహాత్మక ప్రాధాన్యత వహిస్తుందని ఎరిబా వర్గాలు చెప్పాయి. ఇండియాలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టుగా ఈ ఏడాది జనవరిలో ప్రకటించినప్పటికీ అమెరికా ఆర్ధిక వ్యవస్థలో మాంద్యం వల్ల ఈ ప్రతిపాదనను కట్టిపెట్టాల్సివచ్చిందని ఆ వర్గాలు తెలిపాయి.
- సిల్వర్‌లైన్,సెరినోవా ఆస్ట్రేలియా విలీనం
- ఐటి కే హైదరాబాద్ యువత ఓటు












Click it and Unblock the Notifications
