వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిల్వర్‌లైన్‌,సెరినోవా ఆస్ట్రేలియా విలీనం

By Staff
|
Google Oneindia TeluguNews

సిడ్నీ: ప్రవాస భారతీయులు ప్రమోట్‌ చేసిన సెరినోవాను టేకోవర్‌ చేసిన భారతీయ సంస్థ సిల్వర్‌లైన్‌ క్రమంగా విలీనం ప్రక్రియను పూర్తి చేస్తున్నది. ఈ క్రమంలో భాగంగా సెరినోవా ఆస్ట్రేలియా పేరును సిల్వర్‌లైన్‌ ఆస్ట్రేలియా మార్చినట్టు సిల్వర్‌లైన్‌ వర్గాలు చెప్పాయి. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, ఇంటిగ్రేషన్‌ సర్వీసుల రంగంలో వున్న సిల్వర్‌లైన్‌ ఈ ఏడాది మార్చిలోనే సెరినోవాను కొనుగోలు చేసింది.

ఇప్పటికే సెరినోవా వివిధ దేశాల శాఖలను సిల్వర్‌లైన్‌లో విలీనం చేశారు. సెరినోవాను టేకోవర్‌ చేయడం వల్ల ఇ-బిజినెస్‌, ఐటి సర్వీసుల రంగంలో అంతర్జాతీయంగా పెద్ద శక్తిగా సిల్వర్‌లైన్‌ ఎదిగే అవకాశం ఏర్పడింది. ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా మార్కెట్లలో సిల్వర్‌లైన్‌ చురుగ్గా వున్నదని సంస్థ వర్గాలు చెప్పాయి. హైదరాబాద్‌తో సహా అనేక ప్రధాన భారతీయ నగరాల్లో డెవలప్‌మెంట్‌ సెంటర్లు వున్న సిల్వర్‌లైన్‌ ఈ మధ్యనే కైరోలో ఒక డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభించింది.

  • ఇండియా సెంటర్‌కు ఎరిబా స్వస్తి
  • ఐటి కే హైదరాబాద్‌ యువత ఓటు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X