శివసేన నేతతో వాజ్పేయి భేటీ
ముంబాయి: మోకాలి ఆపరేషన్ తర్వాత ప్రధాని వాజ్పేయి శరవేగంగా కోలుకుంటున్నారు. మంగళవారం నాడు ఫిజియోథెరపి తర్వాత ప్రధాని శివసేన నేత బాల్థాకరేతో కాసేపు మంతనాలు జరిపారు. ఈ ఇద్దరు నేతల మధ్య భేటీకి ప్రత్యేక కారణమేదీ లేదని బిజెపి వర్గాలు చెబుతున్నా, రానున్న కేబినెట్ విస్తరణలో మరికొన్ని మంత్రిపదవులను శివసేనకు ఇవ్వాలని థాకరే ప్రధానిని కోరారని తెలిసింది.
థాకరే కంటే ముందు ప్రధాని మహారాష్ట్ర బిజెపి నేతలతో కూడా కాసేపు సమావేశమయ్యారు. ప్రధాని పూర్తి ఉల్లాసంగా వున్నారని ఆపరేషన్ చేసిన అమెరికా డాక్టర్ రణావత్ చెప్పారు. ప్రధాని ఆరోగ్య స్థితి పట్ల ఆయన పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని ఎప్పుడు కోరితే అప్పుడు డిస్చార్జ్ చేయడానికి తాము సిద్ధంగా వున్నామని ఆయన వెల్లడించారు. కాగా ప్రధాని అస్పత్రిలో నుంచి అధికార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర ఫైళ్లను అధికారులు ప్రధాని వద్దకు తీసుకుపోతున్నారు.












Click it and Unblock the Notifications
