కమ్యూనిస్టు యోధుడు మోటూరి మృతి
విజయవాడః కమ్యూనిస్టు పార్టీ వృద్ధ నాయకుడు మోటూరి హనుమంతరావు సోమవారం ఉదయంవిజయవాడలో కన్నుమూశారు. ఆయన కొద్ది రోజులుగా కాలేయానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకువిజయవాడలోని ఆస్పత్రిలో మోటూరి కన్నుమూశారు.
తెలుగునేలపై కమ్యూనిస్టు ఉద్యమానికి రూపునిచ్చిన మోటూరి హనుమంతరావు ఎందరో నేతలను ప్రభావితం చేశారు. గతంలో పార్లమెంటు సభ్యునిగా కూడా పదవీ బాధ్యతలు నిర్వహించిన మోటూరి పలు ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు జీవితాన్ని అంకితం చేసిన మోటూరి అంత్య క్రియలు మంగళవారంవిజయవాడలో జరుగుతాయి.
మోటూరి హనుమంతరావు మృతికి రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులుఅర్పించారు.












Click it and Unblock the Notifications
