గాంధీభవన్లో ఘర్షణ,ఉద్రిక్తత
హైదరాబాద్: పార్టీ అగ్రనేతలముందే ఘర్షణలకు, తోపులాటలకు కాంగ్రెస్ రాష్ట్ర శాఖ ప్రధానకార్యాలయం గాంధీభవన్ ప్రాంగణం మరోసారివేదికగా మారింది. పార్టీ కార్యక్రమం జరుగుతున్న ప్రకాశంహాల్ కొద్ది సేపు రణభూమిగా మారింది. కాంగ్రెస్ అనుబంధవిద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ రాష్ట్ర సదస్సులోఆదివారం పన్నెండున్నర గంటలకుకార్యకర్తలు, నాయకులు ఘర్షణ పడ్డారు. పసిసి అధ్యక్షుడుఎం.సత్యనారాయణరావు, సిఎల్పి నాయకుడు డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డిలతో పాటు ఇద్దరువర్కింగ్ కమిటీ సభ్యులు, ముగ్గురు ఎఐసిసికార్యదర్శులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, తదితరులుచూస్తుండగా వైరి వర్గాలు వేదికపై ఘర్షణకుదిగి, కొట్టుకున్నంత పని చేశాయి. ముఖ్యనాయకులువారిస్తున్నా వినకుండా పరస్పరం నెట్టుకోవడం,పడదోసుకోవడం వరకూ వెళ్లారు. చివరకు కొంతమందిని వేదికపై నుంచి పడదోశారు.
ఇరు వర్గాలను సముదాయిండానికిప్రయత్నించిన ఎఐసిసి కార్యదర్శి వి. హన్మంతరావు,ఎన్ఎస్యుఐ అఖిల భారత కార్యదర్శి మస్తాన్వలీ, తదితరులు కోపోద్రిక్తులై వేదికపైకిదూసుకువచ్చిన వారిని కిందికి నెట్టేశారు. ఈతోపులాటలో ఎన్ఎస్యుఐ మాజీ ప్రధానకార్యదర్శి బండ చంద్రారెడ్డితో పాటు కొందరుకింద పడిపోయారు. ప్రకాశం హాల్లో దాదాపు అరగంటసేపు ఉద్రిక్తత నెలకొంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!