తెలంగాణాపైచేతులెత్తేసిన కాంగ్రెస్‌

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పైకాంగ్రెస్‌ అధిష్ఠానం చేతులెత్తేసింది. ప్రజలంతా కోరుకుంటున్నప్పుడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకావాలనుకోవడంలో తప్పు లేదని, అయితే ఈనిర్ణయం తీసుకోవాల్సిందీ, ప్రజల కోరికను మన్నించాల్సిందీఅధికారంలో ఉన్న బిజెపియేనని కాంగ్రెస్‌ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జి దల్జీత్‌సింగ్‌ అన్నారు. ప్రత్యేక తెలంగాణాపై పార్టీఅధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకోవాలని తెలంగాణాకాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ కన్వీనర్‌ ఎ. ఇంద్రకరణ్‌ రెడ్డితో పాటు ఇతరులుఆదివారం ఆయనకు వినతి పత్రంసమర్పించారు.

ఈ సందర్భంగా దల్జీత్‌ సింగ్‌ భారమంతా బిజెపిమీద తోసేశారు. తెలంగాణాపై నిర్ణయం ఒక్కరోజులోనో, రెండు రోజుల్లోనో తీసుకునేదికాదని, రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపితే పరిశీలించగలమని బిజెపిమెలిక పెట్టిందని, ఈ స్థితిలో కాంగ్రెస్‌ తొందరపడినిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు చేయాల్సిందిబిజెపియేనని ఆయన అన్నారు. తెలంగాణాకాంగ్రెస్‌ అని కాకుండా కాంగ్రెస్‌ తెలంగాణా విభాగంగా తమనుతాము పిలుచుకోవాలని ఆయన తెలంగాణా కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీకి హితవుచెప్పారు.

తామంతా ఈ నెల 19వ తేదీనమరోసారి ఢిల్లీ వెళ్లి పార్టీ సబ్‌ కమిటీ ముందు తమవాదనను వినిపిస్తామని ఇంద్రకరణ్‌ రెడ్డి విలేకరులకుచెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+