వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వరబ్రహ్మ కె.వి.మహదేవన్‌ కన్నుమూత

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నయ్‌ః తెలుగు సినీ సంగీత రంగాన్ని నాలుగు దశాబ్దాల పాటు లాలించి, పాలించినస్వరబ్రహ్మ కె.వి. మహదేవన్‌ గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు. మహదేవన్‌ కొద్ది రోజులుగాఅస్వస్థతతో బాధపడుతున్నారు. ఆయనకు 84ఏళ్లు.

ఐదు దశాబ్దాలకు పైగా ఆయన చలనచిత్రరంగంలోవేయికి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వంవహించారు. మోడర్న్‌ థియేటర్‌ నిర్మించిన చిత్రంతోఆయన సినీరంగ ప్రవేశం జరిగింది. తమిళంలో 750చిత్రాలకు, తెలుగులో 350 చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వంవహించారు. నిర్మాత సినీరంగంలో ప్రవేశించినఆయన సంగీత దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయివరకు కీర్తి పతాకను ఎగుర వేశారు. ఆయనతమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో 1918లోజన్మించారు. తెలుగులో ఆయన సంగీతం దర్శకత్వంవహించిన చివరి సినిమా స్వాతికిరణం.స్వర్గీయ ఎన్‌.టి. రామారావు నిర్మించి నటించినశ్రీనాథ కవిసార్వభౌముడు చిత్రానికి కూడా కొంతమేరకు సంగీతం కూర్చడంలో సహకరించారు.ఆయన అనేక సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు.

ఆయన సంగీత దర్శకుడిగా రెండు సార్లు జాతీయఅవార్డులు అందుకున్నారు. శంకరాభరణం చిత్రానికి గాను 1980లోఆయన జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగులోమూగ మనసులు, మంచి మనసులు, సెక్రటరీ,దసరా బుల్లోడు, అడవి రాముడు వంటి అనేక సినిమాలకు సంగీతంఅందించారు. జగపతి, అన్నపూర్ణ వంటి పేరు మోసిన సంస్థలునిర్మించిన చిత్రాలకు మహదేవన్‌ సంగీత దర్శకత్వంవహించారు. తెలుగు సినీ రంగంలోనిప్రముఖులందరితో ఆయన కలిసి పని చేశారు.మావ మావ అనే పాటను స్వర పరిచినప్పటినుంచి మహదేవన్‌ను స్వర్గీయ ఆత్రేయమావ అని పిలవడం మొదలు పెట్టారు. ఈ రకంగా తెలుగు సినీప్రముఖులందరి చేత మహదేవన్‌మావ అని పిలుపించుకున్నారు. ఆయన తెలుగువాడుకాదంటే నమ్మలేనంతగా తెలుగు ప్రజలమనసులను ఆకట్టుకున్నారు.

మహదేవన్‌ మృతికి ప్రధానిఅటల్‌ బిహారీ వాజ్‌పేయి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులతో పాటుఅక్కినేని నాగేశ్వరరావు, కె. విశ్వనాథ్‌ వంటి సినీప్రముఖులందరూ సంతాపం ప్రకటించారు.

మహదేవన్‌ సంగీతం ఆబాలగోపాలాన్ని అలరించేందిగా వుండేది. శంకరాభరణం, సిరివెన్నెల వంటి సినిమాలకు ఆయనశుద్ధ సంప్రదాయ సంగీతం అందించారు. అయితే ఆ చిత్రాలలోని పాటలు పండితులతో పాటు, పామరులను సైతం రంజింపచేయడం మహదేవన్‌ ప్రతిభకు నిదర్శనం.

60వ దశకం నుంచి తెలుగు, తమిళ చిత్రాలకుస్వరాలను అందించిన ఆ సంగీత ఝరి ఆగిపోయింది..... తెలుగుపాట మూగపోయింది!!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X