వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌తో పొత్తు లేదు: కెసిఆర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: పంచాయతీరాజ్‌ సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) నేత కె. చంద్రశేఖర్‌రావు (కెసిఆర్‌) స్పష్టం చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌కు మద్దతు తెలిపితే కాంగ్రెస్‌తో స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని ఇప్పటి వరకు ప్రకటిస్తూ వస్తున్న చంద్రశేఖర్‌ రావు ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతేకాదు, వరంగల్‌ సభలో ఆయన కాంగ్రెస్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీ హోదా పొందిన తర్వాత తెలంగాణా రాష్ట్ర సమితి మొదటి బహిరంగ సభ ఇదే. చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో గురువారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తెలంగాణా రాష్ట్ర సమితి ర్యాలీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరు, వరంగల్‌ జిల్లాలోని జనగామ, తదితర ప్రాంతాల మీదుగా రాత్రి 9 గంటల ప్రాంతంలో వరంగల్‌కు చేరుకుంది. చంద్రశేఖర్‌రావు మార్గమధ్యంలో పలు చోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు మద్దతు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు. తెలంగాణా ఉద్యమానికి భయపడి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు తెలంగాణాకు వరాలు
ప్రకటిస్తున్నారని, ఇది ఎన్నికల ఎత్తుగడ మాత్రమేనని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని తెలంగాణా ప్రజలు ఓడిస్తారని, చాలా చోట్ల ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు. కరెంట్‌ ఛార్జీలు పెంచిన తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే కరెంట్‌ ఛార్జీల పెంపును ఆమోదించినట్లేనని ఆయన అన్నారు. 610 ఉత్తర్వులపై చంద్రబాబు ప్రభుత్వం డ్రామా ఆడుతోందని ఆయన అన్నారు.

తెలంగాణాకు సంబంధించినంత వరకు కాంగ్రెస్‌ అపవిత్ర పార్టీ అని ఆయన విమర్శించారు. తెలంగాణాకు చెందిన 400 మందిని ఆ పార్టీ పొట్టన పెట్టుకుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X