రీసెర్చ్‌కే విజువల్సాఫ్ట్ ప్రాధాన్యత
హైదరాబాద్: ఐటి రంగంలో నెలకొని వున్న పరిస్థితుల దృష్ట్యా పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయింపులను భారీగా పెంచాలని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ సర్వీసులు, ప్రాడక్ట్స్ సంస్థ విజువల్ సాఫ్ట్ నిర్ణయించింది.
భవిష్యత్తులో ఐటి రంగంలోని కంపెనీల మనుగడ ఆయా సంస్థల టెక్నాలజీ సామర్ధ్యంపైనేఆధారపడివుంటుందని విజువల్సాఫ్ట్ భావిస్తున్నది. అందువల్ల ఆర్‌అండ్‌డికి విస్తృత ప్రాధాన్యత నివ్వడం ద్వారా టెక్నాలజీలో ఆధిక్యతను సాధించాలని సంస్థ యోచిస్తున్నది. 2000-2001 సంవత్సరంలో తమ మొత్తం ఆదాయంలో 2.35 శాతం సుమారు మూడు కోట్ల రూపాయలు ఆర్‌అండ్‌డి పై వెచ్చించిన ఈ సంస్థ మునుముందు ఈ వ్యయాన్ని రెట్టింపు చేసే ఆలోచనలో వుంది.
బిజినెస్ ఇంటలీజెన్స్ సొల్యూషన్స్, ప్రాసెస్ ఇంటిగ్రేషన్, ఎక్స్ఎంఎల్ టెక్నాలజీస్, ఇ-బిజినెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్, నాలెడ్జి మానేజ్మెంట్ అండ్ ఆటోమేషన్ టూల్స్ రంగాల్లో సంస్థ కృషిచేస్తున్నది. ఈ రంగాల్లో కొత్త ప్రాడక్ట్స్, టూల్స్‌ను ఆవిష్కరించే సన్నాహాల్లోవుంది.