తెలుగులో అమీర్‌ఖాన్ లగాన్
హైదరాబాద్: లగాన్ చిత్రాన్ని తెలుగులోకిఅనువదించి విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాత, హీరోఅమీర్ ఖాన్ చెప్పారు. తమిళ భాషలో కూడా ఈ చిత్రాన్నివిడుదల చేస్తామని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో తనను కలిసినవిలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు.బ్రిటిష్ కాలంనాటి ఇతివృత్తంతో కోట్ల రూపాయలఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రానికి మంచి ప్రతిస్పందన లభించిందనిఆయన చెప్పారు. ఈ ఘనతంతా దర్శకుడు అసుతోష్‌దేననిఆయన అన్నారు. ఈ చిత్ర నిర్మాణానికి కాన్సెప్ట్, కథఅసుతోష్‌దేనని ఆయన అన్నారు. హీరోయిన్ గ్రేసి సింగ్‌నుఅమీర్ ఖాన్ ప్రశంసలతో ముంచెత్తారు.
మంచి సాంకేతిక విలువలతోనిర్మించే చిత్రాలను ప్రజలు ఆదరిస్తారని లగాన్ చిత్రవిజయం నిరూపించిందని ఆయన అన్నారు. చిత్రనిర్మాణం రిస్క్‌తో కూడుకున్నదే అయినప్పటికీ ఉన్నతప్రమాణాలతో నిర్మిస్తే ఆదరణ పొందుతాయని ఆయనఅన్నారు. లగాన్ చిత్రం నిడివి ఎక్కువగా వున్నందువల్ల ప్రేక్షకులు విసుగు చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లుఆయన తెలిపారు. ఈ చిత్రం అందించిన విజయంతోమరిన్ని చిత్రాలు నిర్మిస్తానని ఆయన చెప్పారు.లగాన్ చిత్రానికి లభిస్తున్నప్రతిస్పందనను పరిశీలించడానికి ఆయనదేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటనలుచేస్తున్నారు.












Click it and Unblock the Notifications