జూనియర్ ఛాంపియన్‌షిప్‌పై హంపి దృష్టి
హైదరాబాద్: ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్ సాధించడమే తన లక్ష్యమని మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ విజేత, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి అన్నది. ఈ పోటీలు ఆగస్టులో ఏథెన్స్‌లో జరుగుతాయి. ఆమె మంగళవారం ఇక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలుసుకున్నది. ఈ సందర్భంగా కోనేరు హంపిని ముఖ్యమంత్రి సత్కరించారు.
హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన పోటీల్లో వుమెన్స్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెల్చుకున్న తర్వాత తొలిసారిగా ఆమె హైదరాబాద్ వచ్చింది. వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే అర్హతను సాధించడానికే తాను హంగేరీ పోటీల్లో పాల్గలొన్నట్లు హంపి చెప్పింది. మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెల్చుకున్న రెండవ భారతీయురాలు హంపి.












Click it and Unblock the Notifications