ఐబిఎం నుంచి ఫాస్టెస్ట్ చిప్
న్యూయార్క్: ప్రపంచంలోని అతిపెద్ద కంప్యూటర్ సంస్థల్లో ఒకటైన ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ (ఐబిఎం) ప్రపంచంలో ఇప్పుడున్న అన్నిరకాల సిలికాన్ ట్రాన్సిస్టర్స్ కంటే అత్యంత వేగవంతమైన సిలికాన్ ట్రాన్సిస్టర్‌ను డెవలప్‌చేసినట్టుగా ప్రకటించింది.
ప్రస్తుత మోడల్స్ కంటే అయిదురెట్లు వేగంగా పనిచేసే ఈ మైక్రో చిప్స్‌ను రెండేళ్లకాలంలో మార్కెట్లోకి తేనున్నట్టుగా ఐబిఎం ప్రకటించింది. సిలికానే భవిష్యత్తులో కూడా సెమికండక్టర్ల తయారీలో ప్రధాన ముడిపదార్ధంగా వుంటుందని ఐబిఎం చెబుతున్నది. ఫాస్టెస్ట్ చిప్స్ తయారీ కోసం ఇతర పదర్ధాలపైకి పరిశోధకరులు దృష్టి మళ్లించినప్పటికీ సిలికాన్‌ను మించిన మరో పదార్ధం ఇప్పట్లో లభిస్తుందని తాము భావించడం లేదని ఐబిఎం వర్గాలు చెప్పాయి.












Click it and Unblock the Notifications