వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశాల్లో టాటా ఇన్ఫోటెక్‌ కేంద్రాలు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: విదేశాల్లో పెద్ద సంఖ్యలో ఐటి శిక్షణా కేంద్రాలను ప్రారంభించాలని టాటా ఇన్ఫోటెక్‌ నిర్ణయించింది. దక్షిణాసియాలోని వివిధ దేశాల్లో ఇదివరకే కేంద్రాలను ప్రారంభించిన టాటా ఇన్ఫోటెక్‌ ఇప్పుడు దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్‌, వియాత్నాం, మైన్మార్‌, శ్రీలంక వంటి దేశాలదిశగా దృష్టి సారిస్తున్నది.

చైనాలో కూడా అపారమైన అవకాశాలు వున్నాయని వాటిని కూడా అందుకునే ప్రయత్నం చేస్తామని టాటా ఇన్ఫోటెక్‌ ఎండి నిర్మల్‌ జైన్‌ చెప్పారు. ఈ మధ్య కాలంలో తమ కార్యకలాపాలను పెద్దఎత్తున పునర్‌వ్యవస్థీకరించినట్టుగా సంస్థ వెల్లడించింది. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా గతంలో లాగా కాకుండా ఇప్పుడు తాము భాగస్వామ్య పద్దతిలో కొత్తకేంద్రాలను ప్రారంభిస్తున్నట్టుగా జైన్‌ తెలిపారు. విదేశాల్లో అక్కడి సంస్థల భాగస్వామ్యంలో తెరిచే శిక్షణ కేంద్రాల్లో మెజార్టీ వాటా తమదే వుంటుందని అయితే ఫాకల్టీని, కోర్స్‌ కంటెంట్‌ను తామే సమకూరుస్తామని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X