కరుణానిధి అరెస్టుః జైలుకు తరలింపు

చెన్నయ్‌ః తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిఎం. కరుణానిధిని శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత పోలీసులుఅరెస్టు చేశారు. 12 కోట్లు రూపాయల ఫ్లై ఓవర్‌ స్కామ్‌ కు సంబంధించి సిఐడి విభాగం పోలీసులు శుక్రవారం రాత్రి 2.30 గంటల ప్రాంతంలో కరుణానిధిని అదుపులోకి తీసుకున్నారు.

77 ఏళ్ల వృద్ధ నేత కరుణానిధిని జయలలిత ఆదేశాల పై అత్యంత అవమానకరమైన పరిస్థితుల్లో పోలీసులుఅరెస్టు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కరుణానిధిఅరెస్టు ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కేంద్ర మంత్రి మురసోలి మారన్‌పై పోలీసులు చేయిచేసుకున్నారు. పోలీసులుదెబ్బలతో గాయపడిన ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో వున్నారు.

శనివారం నాడు మరో కేంద్రం మంత్రి టిఆర్‌ బాలును కూడా ఆరెస్టు చేశారు. కోర్టు కరుణానిధిని జులై 10 వరకు రిమాండ్‌ చేసింది. ఆయన బెయిల్‌ పిటీషన్‌పై జులైన మూడునవిచారణ జరుపుతారు. కరుణానిధి అరెస్టును అడ్డుకోవడానికి ఆయన ఇంటివద్ద గట్టిగా ప్రయత్నించిన మురసోలి మారన్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టారు. కొట్టి ఆయన్ను కరుణానిధి ఇంటిముందు వదిలి వెళ్లిపోయారు. కరుణాను వుంచిన పోలీసుస్టేషన్‌కు వెళ్లిన మారన్‌కు అక్కడ కూడా పోలీసుల దురుసుతనం ఎదురయింది.అరెస్టు చేసేందుకు అధారం ఏమున్నదని ప్రశ్నించినందుకు తనపై చేయిచేసుకున్నారని ఆయన మారన్‌ తెలిపారు.

తండ్రి అరెస్టువిషయం తెలిసిన చెన్నై మేయర్‌ స్టాలిన్‌ శనివారం ఉదయంస్వయంగా వెళ్లి ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టు ముందు లొంగిపోయారు. తనకు ప్రాణ భయం వున్నదని ఆయన చెప్పారు. స్టాలిన్‌ను పదిరోజుల జుడిషియల్‌ కస్టడికీ కోర్టు పంపింది. ఇదిలా వుండగా మరో కేంద్ర మంత్రి బాలును కూడా పోలీసులు శనివారం మధ్యాహ్నంఅరెస్టు చేశారు. పోలీసులు విధి నిర్వహణకు అడ్డుతగిలిన ఆరోపణలపై ఆయన్నుఅరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు.

నిన్నటి వరకుడిఎంకె ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన 12 మందిని కూడా పోలీసులుఅరెస్టు చేశారు.

ఈ హఠాత్‌ పరిణామాలు తమిళనాట సంచలనం సృష్టించాయి. ఇటీవలే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన జయలలిత కక్ష సాధించేందుకే కరుణానిధిని జైలు పాలు చేసిందినేవిమర్శలు వినిపిస్తున్నాయి.

  • అట్టుడుకుతున్న తమిళనాడు
  • కేంద్రం సీరియస్‌
  • ఆస్పత్రిలో కేంద్రమంత్రి మారన్‌
  • జెలులో కరుణ సత్యాగ్రహం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+