ఇండియన్ టెకీలకు భలే గిరాకీ
న్యూఢిల్లీ: జర్మనీలోని ఐటి ఉద్యోగాల్లో భారతీయుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. జర్మనీలో సురెంబర్గ్ కేంద్రంగా పనిచేసే ఫెడరల్ లేబర్ ఆఫీసు ఇటీవలే భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణులకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. జర్మనీలోని ఇన్ఫోటెక్ ఉద్యోగాల్లో అధికభాగం భారతీయులే కైవసం చేసుకుంటున్నారు.
విదేశీ సాఫ్ట్‌వేర్ నిపుణులకు జర్మనీ జారీ చేస్తున్న గ్రీన్‌కార్డుల్లో ప్రతి ఐదు కార్టుల్లో ఒకటి భారతీయ నిపుణులు చేజిక్కించుకుంటున్నారు. భారత్ తర్వాత స్థానంలో రష్యా, ఉక్రెయిన్, ఇతర బాల్టిక్ దేశాలు వున్నాయి. అమెరికా మాంద్యం దరిమిలా అనేక భారతీయ కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను జర్మనీకి మళ్లించాయి.
టాటా కన్సల్టెన్సీ, మాస్టెక్, డేటామాటిక్స్ వంటి బడా కంపెనీలు మాత్రమే కాకుండా చిన్న చిన్న కంపెనీలు సైతం ఇప్పుడు జర్మనీ దెసగా దృష్టిసారిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 33 ఇండియన్ ఐటి కంపెనీలు జర్మనీలో కార్యకలాపాలు ప్రారంభించాయని అంటున్నారు. భారతీయ నిపుణులు జర్మనీలో ఏడాదికి సగటున 21 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అమెరికాతో పోలిస్తే ఈ మొత్తం మరీ తక్కువేమీ కాదు.












Click it and Unblock the Notifications