జపాన్ కంపెనీతో ఇన్ఫోటెక్ ఒప్పందం
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ తన సాఫ్ట్‌వేర్ ప్రాడెక్ట్స్, సర్వీసుల మార్కెటింగ్ కోసం జపాన్ సంస్థ ఇ అండ్ ఎంతో భాగస్వామ్య ఒప్పంద కుదుర్చుకున్నది.
నిహాన్ ఇ అండ్ ఎం కంపెనీ అనుబంధ సంస్థ అయిన ఇఅండ్‌ఎంకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ డిజైన్, ప్రొడక్షన్ లోనూ, మ్యాప్‌డాటా, జిఐఎస్ మార్కెటింగ్‌లో విశేష అనుభవం వున్నదని ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్ మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫోటెక్‌కు సంబంధించిన జిఐఎస్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, సర్వీసులను జపాన్‌లో ఇఅండ్‌ఎం మార్కెట్ చేస్తుంది. ఈ ఒప్పందం వల్ల జపాన్‌లో ఈ ఏడాది 10 లక్షల డాలర్ల వ్యాపారానికి అవకాశం వున్నట్టుగా ఇన్పోటెక్‌వెల్లడించింది.












Click it and Unblock the Notifications