రాజకీయాల్లో మహిళలకుపెద్దపీటః బాబు

హైదరాబాద్‌ : మహిళల ఆర్ధికాభివృద్ధికోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఎంతో కృషి చేస్తున్న ప్రభుత్వం రాజకీయంగా కూడా మహిళలకు సముచిత స్ధానం ఇస్తుందని ఆయన ప్రకటించారు. రానున్న పంచాయితీ ఎన్నికలలో డ్వాక్రా మహిళలకు తమ పార్టీ మరిన్ని ఎక్కువసీట్లు కేటాయిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.శుక్రవారం నాడు మహబూబ్‌ నగర్‌ జిల్లా కల్వకుర్తి,పెబ్బేరులలో జరిగిన ఎన్నికల సభలలో ఆయన ప్రసంగించారు.

ఉచిత కరెంట్‌ అసాధ్యం ..........
తాము అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్‌ ఇస్తామని కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న వాగ్ధానంవొట్టి బూటకమని ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు అన్నారు. ఎవరు అధికారంలో వున్నా రైతులకు ఉచిత కరెంట్‌ సరఫరా చేయటం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఆచరణ సాధ్యంకాని వాగ్ధానాలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నవారిపట్ల అప్రమర్తంగా ఉండాలని ఆయన ప్రజలనుకోరారు. ఒక యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి 2.20 రూపాయలు ఖర్చవుతుండగా, ప్రభుత్వం రైతులకు యూనిట్‌విద్యుత్‌ను కేవలం 20 పైసలకే రైతులకు అందిస్తున్నదని చంద్రబాబు తెలిపారు.

రాష్ట్రం ముక్కలయితే నష్ట పోయేది ప్రజలే కాని నాయకులు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. కావున, రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తున్న నాయకులకు ప్రజలే తగు విధంగా బుద్ధి చెప్పాలని చంద్రబాబుకోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+