గురువారం 5-7-2001

చెన్నై: మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, కేంద్ర మంత్రులు మురసోలి మారన్‌, బాలు అరెస్టు సందర్భంగా చిత్రించినట్టుగా పోలీసులు చెబుతున్న వీడియో కాసెట్లలోని దృశ్యాలను ఐటి సాయంతో మాయ చేసినట్టుగా ప్రముఖ ఫొరెన్సిక్‌ నిపుణులు ప్రొఫెసర్‌ చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు.

ఫొరెన్సిక్‌ సైన్స్‌లో చంద్రశేఖరన్‌ అంతర్జాతీయంగా అందెవేసిన చేయి. రాజీవ్‌ హత్య కేసులో ఆయన కృషివల్లనే మానవబాంబు థానును గుర్తించగలిగారు. పోలీసులు విడుదల చేసిన వీడియో కాసెట్లను చూసినప్పుడు డిజిటల్‌ టెక్నాలజీ సాయంతో కొన్ని దృశ్యాలను తమకు అనుకూలంగా చూపించగలిగినట్టు స్పష్టమవుతున్నదని ఆయన చెప్పారు. పోలీసులు చూపిస్తున్న వీడియో కాసెట్లు పూర్తి ఒరిజనల్‌ కాదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు పోలీసులు ఇంతగా దిగజారుతారని తాను అనుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.

అరెస్టు సమయంలో తమతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని కరుణానిధి, మారన్‌, బాలు ఆరోపిస్తుండగా వారిది ఉత్త డ్రామా అని పోలీసులు చెబుతున్న విషయం విదితమే. ఈ అరెస్టులకు సంబంధించి సన్‌టీవీ ప్రసారం చేసిన దృశ్యాలకు భిన్నమైన దృశ్యాలతో పోలీసులు తమ కాసెట్లను ప్రదర్శిస్తున్నారు. పోలీసుల కాసెట్లలో మారన్‌ డిఐజిని కొడుతున్నట్టుగా వున్న దృశ్యం ఒరిజనల్‌ దృశ్యం కాదనీ సాంకేతిక పరిజ్ఞానంతో దానిని మాయ చేశారని చంద్రశేఖరన్‌ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+