వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాంబు దాడులు-అమర్‌నాథ్‌ యాత్ర రద్దు

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: అమర్‌నాథ్‌ యాత్రతాత్కాలికంగా రద్దయింది. అమర్నాథ్‌ యాత్రికులపై కాశ్మీరీమిలిటెంట్లు రెండు బాంబు దాడులు చేశారు. ఈ బాంబుదాడుల్లో 11 మంది, పోలీసుల కాల్పుల్లో ఒక మిలిటెంటుమరణించారు. బాంబు దాడుల్లో ముగ్గురు మహిళలతోసహా ఐదుగురు యాత్రికులు, ఇద్దరు జవాన్లు,నలుగురు పౌరులు మరణించారు. ఈ దాడుల్లో మృతుల సంఖ్య 13కుపెరిగింది. మిలిటెంట్లు శేష్‌నాగ్‌ సైనిక శిబిరంపైదాడికి దిగారు. దీంతో భద్రతా దళాలకు, మిలిటెంట్లకు మధ్య కాల్పులుజరిగాయి. దీంతో అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగారద్దు చేశారు. కేవలం 25 నిమిషాల వ్యవధిలో ఈ బాంబుదాడులు జరిగాయి.

అమర్‌నాథ్‌కు 20 కిలోమీటర్లసమీపంలో ఈ బాంబు దాడులు జరగడంతో తీవ్రఉద్రిక్తత నెలకొంది. ఈ దాడుల్లో గాయపడిన ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇందులో ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరంగావుంది. అనంతనాగ్‌, జమ్ములలో బంద్‌పాటించారు. మరణించిన పోలీసు అధికారులమృతదేహాలను ప్రత్యేక విమానంలోశ్రీనగర్‌కు తెచ్చారు.

కేంద్ర హోంశాఖసహాయ మంత్రి ఐ.డి. స్వామి నేతృత్వంలోని త్రిసభ్య సంఘంఆదివారం శేష్‌నాగ్‌ను సందర్శిస్తుంది. ఈ బృందం తననివేదికను హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీకి అందజేస్తుంది.అమర్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభంపై ఆదివారంనిర్ణయం తీసుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X