విజయ్ ప్రమాణ స్వీకారం సమయంలో భార్య, పిల్లలు ఎక్కడున్నారు..?
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత, దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్‌తో సీఎంగా గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలతో పాటుగా సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి విజయ్ తల్లిదండ్రులు శోభ, ఎస్. ఏ. చంద్రశేఖర్ వచ్చారు. ఇక విజయ్ ప్రమాణస్వీకారంలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. త్రిష నీలిరంగు కంచి పట్టుచీర, జడలో మల్లెపూలతో తమిళ సంప్రదాయం ఉట్టిపడేలా ఆమె కనిపించారు. అయితే విజయ్ ప్రమాణస్వీకారానికి అతని భార్య సంగీత స్వర్ణ లింగం, పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాషాలు మాత్రం హాజరు కాలేదు. దాంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే గత కొంతకాలంగా విజయ్, అతని భార్య సంగీత మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులకు అప్లై చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం సంగీత లండన్ లో ఉన్నారు. అలాగే విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ కూడా తన తల్లి వద్దే లండన్ లో ఉన్నట్లు సమాచారం. అటు విజయ్ ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పుడు కూడా జాసన్ సోషల్ మీడియా ద్వారా కూడా కనీసం అభినందనలు తెలపలేదు. ఇదే విషయంపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఓ వైపు నటి త్రిష హాజరు కావడం.. మరోవైపు విజయ్ పిల్లలు, భార్య లేకపోవడం విచారకరంగా ఉందంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

ఇంకొకరు కామెంట్ పెడుతూ కొత్త సీఎం.. కొత్త రాణి.. దళపతి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అసలు కథ ముందుంది. భార్య లేదు.. పిల్లలు లేరు.. కానీ విజయ్ తల్లితో త్రిష ఉంది. ఇది విడాకులను నిజం చేయడమా..? మాటల కంటే సంగీత గైర్హాజరే ఇక్కడ ఎక్కువగా మాట్లాడుతోంది.. అని మరో యూజర్ పోస్టు పెట్టాడు.












Click it and Unblock the Notifications