అత్యాశకు పోం:టిడిపి
హైదరాబాద్: బలం లేనిచోట్ల జిల్లా పరిషత్ చైర్మన్ పదవులనుచేజిక్కించుకోవాలనే ఆరాటం తమకు లేదనితెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. సోమవారం జరుగనున్న జిల్లా పరిషత్‌చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులకు అభ్యర్థులను ఎంపికచేసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు కసరత్తు ప్రారంభించారు.ఆయన శనివారం పార్టీ ముఖ్యనాయకులతో, వివిధ జిల్లాలనాయకులతోనూ చర్చలు జరిపారు. ఈ చర్చల వివరాలను పార్లమెంటు సభ్యుడు ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు విలేకరులకు చెప్పారు.
పది జిల్లా పరిషత్‌లనుకైవసం చేసుకోవడానికి తమకు బలంఉన్నదని, ఈ పది జిల్లాలకు అభ్యర్థులను ఖరారుచేయడానికి ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నారనిఆయన చెప్పారు. కాంగ్రెస్, తెలంగాణా రాష్ట్ర సమితిలమద్దతు పొంది జిల్లా పరిషత్‌లనుచేజిక్కించుకోవాలనే ఆలోచన తమకులేదని ఆయన అన్నారు. రిజర్వ్ అయిన చోట్ల అభ్యర్థులఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు.మండల పరిషత్‌ల అభ్యర్థులను జిల్లాస్థాయిల్లోనే ఖరారు చేస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications