అగర్తాలాలో మందుపాతరకు ఒకరు బలి
అగర్తాలా: అగర్తాలా శివారులో ఆదివారం యునైటెడ్ బెంగాలీ లిబరేషన్ ఫ్రంట్ (యుబిఎల్‌ఎఫ్) పేల్చిన మందుపాతరలో ఒక గిరిజనుడు మరణించాడు; మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. రద్దీగా వుండే లేక్ చౌముహాని మార్కెట్‌లో బాంబు పేలడంతో పది మంది గాయపడ్డారని, ఇందులో ఎనిమది మంది గిరిజనులు వున్నారని, ఇందులో ఒకరు ఆస్పత్రిగా తరలిస్తుండగా మరణించాడని శాంతి భద్రతల పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ కె. సలీం అలీ చెప్పారు.
గాయపడిన తొమ్మండుగురిని జి.బి. ఆస్పత్రికి తరలించారని, ఇందులో ఆరుగురి పరిస్థితి తీవ్రంగా వున్నదని ఆయన చెప్పారు. గిరిజన క్రయ విక్రయదారులు పెద్ద యెత్తున వస్తారు కాబట్టే తీవ్రవాదులు ఈ మార్కెట్‌లో మందు పాతర పెట్టారని ఆయన అన్నారు. అగర్తాలా మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో ఇటువంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి.












Click it and Unblock the Notifications