కరవు పనులకు కమిషన్‌ఓకే

హైదరాబాద్‌: ఎన్నికల కారణంగా రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల్లో కరవు సాయం పనులను నిలిపివేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారి కాకి మాధవరావు స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణను పురస్కరించుకుని ఆయన సోమవారం నాడు వివిధ పార్టీల అభిప్రాయల సేకరణకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కరవు సాయం పనులకు ఎన్నికల నిబంధనావళి అడ్డుకారదన్న అభిప్రాయంతో ఏకీభివించారు. అయితే దీనిని అధికార పార్టీ అవకాశం తీసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడరాదని వారుకోరారు. సిపిఎం నేత కొరటాల సత్యవారాయణ, సిపిఐ ప్రతినిధి
నారాయణ, కాంగ్రెస్‌ ప్రతినిధి గాదె వెంకటరెడ్డి, టిఆర్‌ఎస్‌ ప్రతినిధి రామ్మోహన్‌రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీ నిజాయితీపై అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్రం కరవు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నదని ఈ సమయంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కరవు సహాయం పనులను చేపట్టాల్సివున్నదని వారు అన్నారు. అయితే దీనిని అవకాశంగా తీసుకుని అధికార పార్టీ ఎన్నికల్లో లబ్ధిపొందే అవకాశం వున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల అనుమానాలను తెలుగుదేశం ప్రతినిధిలాల్‌జాన్‌ బాషా కొట్టివేశారు. కరవు సహాయం పనుల్లో అధికారులు మాత్రమే చురుగ్గా పాల్గొంటారని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆహార ధాన్యాల పంపిణీ కరువు సాయ పథకాలకు సంబంధించినస్కీమ్‌ల ప్రారంభత్సవాల్లో పాల్గొనడానికి అనుమతినివ్వమని ఎన్నికల కమిషనర్‌ స్పష్టం చేశారు. జిల్లాను ఒక్కో యూనిట్‌గా తీసుకునిఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ పూర్తి చేయాలని ప్రతిపక్షాల ప్రతినిధుల చేసిన సూచనను ఎన్నికల కమిషన్‌ తోసిపుచ్చింది. ఇది ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది. జిల్లాకు ముగ్గురుస్వతంత్ర సభ్యులను పరిశీలకులుగా పంపే విషయం కూడా ఆలోచిస్తామని ఎన్నికల కమిషనర్‌ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+